చాంపియన్స్ ట్రోఫీ విజేత జర్మనీ | Germany lift Hockey Champions Trophy | Sakshi
Sakshi News home page

చాంపియన్స్ ట్రోఫీ విజేత జర్మనీ

Published Sun, Dec 14 2014 9:32 PM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

Germany lift Hockey Champions Trophy

భువనేశ్వర్: చాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ ను జర్మనీ కైవశం చేసుకుంది. భువనేశ్వర్ లోని కలింగ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ ను 2-0తో ఓడించి విజేతగా నిలిచింది. దీంతో చాంపియన్స్ ట్రోఫీని జర్మనీ పదోసారి సొంతం చేసుకుంది. 2007 తర్వాత మళ్లీ టైటిల్ గెలిచింది.

1998 తర్వాత మరోసారి ఈ మెగా టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించిన పాకిస్థాన్ కు నిరాశే ఎదురైంది. ఫైనల్ మ్యాచ్ ఆడకుండా పాక్ ఆటగాళ్లు మహ్మద్ తౌషిక్, అలీ అంజాద్ లపై సస్పెన్షన్ వేటు ఆ జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపింది. భారత్తో సెమీ ఫైనల్ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించడంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య వీరిద్దరిపై వేటు వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement