
సాక్షి, హైదరాబాద్: పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) అంతర్ జిల్లా అండర్–14 హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలికల జట్టు విజేతగా నిలిచింది. బోయిన్‌పల్లిలోని సీఎంఆర్ హైస్కూల్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 8–6తో రంగారెడ్డిపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ 9–8తో ఖమ్మంను ఓడించింది.
బాలుర ఫైనల్లో కరీంనగర్ 17–16తో పెనాల్టీ షూటౌట్‌లో వరంగల్‌పై విజయం సాధించింది. మహబూబ్‌నగర్ 11–8తో ఆదిలాబాద్‌పై గెలుపొంది మూడోస్థానాన్ని దక్కించుకుంది. టోర్నీ ముగింపు కార్యక్రమంలో సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ కరెస్పాండెంట్, కార్యదర్శి సీహెచ్ మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలను బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment