స్పిన్నర్లతో జాగ్రత్తగా ఆడండి
స్పిన్ బౌలింగ్ను సహనంతో ఎదుర్కోవాలని, ఆరంభం నుంచే బ్యాట్స్మెన్ దూకుడు పాటించడం పనికిరాదని టీమిండియా మాజీ కెప్టెన్, భారత్-ఎ టీమ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నాడు. స్పిన్ను ఎదుర్కొనేందుకు సరైన ఫుట్వర్క్ చేయడం అవసరమని అభిప్రాయపడ్డాడు. స్పిన్ బంతులు ఆడటంలో ఒక్కో బ్యాట్స్మన్ది ఒక్కో శైలి అని ద్రావిడ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
టీమిండియా బలాల్లో స్పిన్ బౌలింగ్ ఒకటని ద్రావిడ్ అన్నాడు. అయితే దేశవాళీ క్రికెట్లో నాణ్యమైన స్పిన్నర్ల కొరత ఉందని చెప్పాడు. టాప్-4 స్పిన్నర్లు రాణిస్తున్నారని, మరింతమంది మెరుగైన స్పిన్నర్ల అవసరముందని అన్నాడు. శ్రీలంకతో తొలి వన్డేలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.