మ్యాక్స్‌వెల్ మరో ఘనత | Glenn Maxwell boasts of highest strike rate among players with 1000 IPL runs | Sakshi
Sakshi News home page

మ్యాక్స్‌వెల్ మరో ఘనత

Published Tue, Apr 11 2017 9:13 AM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

మ్యాక్స్‌వెల్ మరో ఘనత

మ్యాక్స్‌వెల్ మరో ఘనత

ఇండోర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ కెప్టెన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ వెయ్యి పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఐపీఎల్‌ లో 1000 పరుగులు పూర్తి చేసిన 53వ ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు 52 మంది ఈ ఘనత సాధించినప్పటికీ వీరందరికంటే అత్యధిక స్ట్రైక్‌ రేటుతో మ్యాక్స్‌వెల్‌ వెయ్యి పరుగులు పూర్తి చేయడం విశేషం.

ఇప్పటివరకు 45 మ్యాచ్‌ లు ఆడిన ఈ ఆస్ట్రేలియా ఆల్‌ రౌండర్‌ 164.75 స్ట్రైక్‌ రేటుతో 1005 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. సోమవారం ఇండోర్ లోని హోల్కర్‌ మైదానంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ మ్యాక్స్‌వెల్‌ (22 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు.

 

ఐపీఎల్లో ఓవరాల్ గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సురేష్ రైనా (4,166)అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాత స్థానంలో విరాట్ కోహ్లి ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ (4,110) రెండో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement