గుర్‌ప్రీత్ కొత్త చరిత్ర
న్యూఢిల్లీ: యూరోపా లీగ్‌లో ఆడిన తొలి భారత ఫుట్‌బాలర్‌గా గుర్‌ప్రీత్ సింగ్ సంధూ చరిత్ర సృష్టించాడు. 6.4 అడుగుల గుర్‌ప్రీత్ గురువారం సాయంత్రం వేల్స్‌లో జరిగిన యూరోపా లీగ్ క్వాలిఫయర్‌లో నార్వేకు చెందిన స్టాబేక్ ఎఫ్‌సీ తరఫున బరిలోకి దిగాడు.
అయితే కేవలం 28నిమిషాల పాటే ఆడిన తను చేతి గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. యూఈఎఫ్‌ఏ చాంపియన్స్ లీగ్ తర్వాత స్థాయి యూరోపా లీగ్‌ది. దీంట్లో ఓ టాప్ జట్టు తరఫున ఆడిన తొలి భారత ఆటగాడిగా తను రికార్డు సృష్టించాడు. గతంలో మొహమ్మద్ సలీం, భూటియా, సునీల్ చెత్రి కూడా విదేశీ క్లబ్‌ల్లో ఆడినా ప్రీమియర్ డివిజన్‌లో మాత్రం ఆడలేదు.