
హైదరాబాద్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్లు గురుసాయిదత్, సమీర్ వర్మ సెమీఫైనల్‌కు చేరారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో గురుసాయిదత్ 13–21, 22–20, 21–11తో లిమ్ చి వింగ్ (మలేసియా)పై; సమీర్ 16–21, 26–24, 21–7తో ప్రతుల్ జోషి (భారత్)పై నెగ్గారు.
మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకృష్ణప్రియ 12–21, 12–21తో యో జియా మిన్ (సింగపూర్) చేతిలో ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 22–20, 14–21, 21–17తో యోంగ్ మింగ్ నోక్–ఎన్జీ సాజ్ యావు (హాంకాంగ్) జోడీపై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment