హామిల్టన్ (సెడాన్ పార్క్)
స్టేడియాలు చూసొద్దాం
పూర్తిగా గ్రామీణ వాతారణం, పిక్నిక్ స్పాట్‌ను తలదన్నేలా అంతర్జాతీయ సౌకర్యాలతో ఈ స్టేడియాన్ని రూపొందించారు. కివీస్ మాజీ ప్రధాని రిచర్డ్ జాన్ సెడాన్ (కింగ్ డిక్) పేరు మీద నిర్మించిన ఈ స్టేడియం హామిల్టన్ సిటీకి గుండెలాంటిది. వలయాకారంలో నిర్మించిన ఈ స్టేడియం స్టాండ్స్ మొత్తం పచ్చిక బయళ్లతో నిండి ఉంటాయి. ప్రేక్షకులు కింద కూర్చొని తమకు నచ్చిన విధంగా మ్యాచ్‌లను ఆస్వాదించొచ్చు.
ఈ స్టేడియాన్ని క్రికెట్‌కోసం డిజైన్ చేసినా ఆఫ్ సీజన్లో వేరే క్రీడలను కూడా నిర్వహిస్తారు. మ్యాచ్‌లను తిలకించేందుకు అత్యంత అనువుగా ఉన్న టాప్-20 స్టేడియాల్లో దీనికి చోటు దక్కింది. ఎగ్జిబిషన్లు, పండుగలు, ఉత్పత్తుల ఆవిష్కరణ, లైవ్ కార్యక్రమాలు, ప్రత్యేక పండుగలకు ఈ స్టేడియాన్ని ఉపయోగిస్తారు.