
బ్రెజిల్‌లో భజ్జీ...
రియో డి జనీరో: భారత క్రికెట్ జట్టులో చోటు దొరక్క, ప్రస్తుతం ఖాళీగా ఉన్న టర్బోనేటర్ హర్భజన్ సింగ్ బ్రెజిల్‌లో గర్ల్‌ఫ్రెండ్ గీతా బస్రాతో కలిసి హల్‌చల్ చేస్తున్నాడు. సాకర్ ప్రపంచకప్ మ్యాచ్‌ల్ని చూసేందుకు ఇక్కడికి వచ్చిన భజ్జీ... బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలేతో కలిసి సరదాగా ఫోటో దిగాడు.
ప్రేయసి బస్రాతో కలిసి ఫొటో దిగితే మీడియా ఎక్కడ రచ్చ చేస్తుందనుకున్నాడో ఏమో ఇద్దరూ పీలేతో వేర్వేరుగా ‘క్లిక్’మనిపించారు. బ్రెజిల్ దిగ్గజంతో దిగిన ఫొటోను గీతా బస్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది.