హార్దిక్ మెరుపులు | hardik pandya maiden century in test carrier | Sakshi
Sakshi News home page

హార్దిక్ మెరుపులు

Published Sun, Aug 13 2017 12:24 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

హార్దిక్ మెరుపులు - Sakshi

హార్దిక్ మెరుపులు

పల్లెకెలె: శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న చివరిదైన మూడో్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. రెండో రోజు ఆటలో తొలుత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్.. ఆపై చెలరేగి ఆడాడు. ప్రధానంగా భారత్ జట్టు ఇన్నింగ్స్ ముగియడానికి వికెట్ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో హార్దిక్ దూకుడుగా ఆడాడు.  లంక స్సిన్నర్ పుష్పకుమార వేసిన ఇన్నింగ్స్ 116 ఓవర్ లో హార్దిక్ బౌండరీల వర్షం కురిపించాడు.

 

తొలి రెండు బంతుల్నిఫోర్లుగా మలిచిన హార్దిక్.. ఆపై మూడు బంతుల్ని సిక్సర్లు కొట్టాడు. దాంతో ఆ ఓవర్ లో 26 పరుగుల్ని హార్దిక్ పిండుకున్నాడు. ఓవరాల్ గా 86 బంతుల్లో  ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో్ హార్దిక్ శతకం సాధించాడు. హార్దిక్ తొలి హాఫ్ సెంచరీ సాధించడానికి 61 బంతులు తీసుకోగా, రెండో హాఫ్ సెంచరీకి 25 బంతులు మాత్రమే ఎదుర్కోవడం విశేషం. ఈ సిరీస్ ద్వారానే టెస్టుల్లో అరంగేట్రం చేసిన హార్దిక్.. ఆడుతున్న మూడో టెస్టులోనే సెంచరీ సాధించడం మరో విశేషం. మరొకవైపు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి వేగవంతమైన సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా హార్దిక్ నిలిచాడు.


అంతకుముందు 329/6 ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన విరాట్ సేన.. లంచ్ సమయానికి మరో  మూడు  వికెట్లు కోల్పోయి 150కు పైగా పరుగులు సాధించింది. దాంతో రెండో రోజు లంచ్ సమయానికి భారత్ జట్టు 487/9 తో ఉంది. ఓవర్ నైట్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా(16) ఆదిలోనే ఏడో వికెట్ గా పెవిలియన్ చేరాడు.ఆ తరుణంలో క్రీజ్ లో ఉన్న హార్దిక్  పాండ్యాకు కుల్దీప్  యాదవ్ జత కలిశాడు. వీరిద్దరూ 62 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో భారత స్కోరు నాలుగు వందలు దాటింది. ఇక చివర్లో మొహ్మద్ షమీ(8) తొమ్మిదో వికెట్ గా అవుటయ్యాడు.అటు తరువాత హార్దిక్ రెచ్చిపోయాడు. ఇక చివరి వికెట్ మాత్రమే మిగిలి ఉండటంతో సాధ్యమైనన్ని పరుగులు సాధించాలనే ఉద్దేశంతో బ్యాట్ కు పనిచెప్పాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే సెంచరీ సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement