![Hardik Pandya Reveals love Story WIth Natasha - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/5/pandya_0.jpg.webp?itok=zBuFylOT)
టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తనకు కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌ల ప్రేమ ప్రయాణం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. ఇప్పటికే తన ప్రేయసి తల్లి కాబోతుందంటూ షాకింగ్ విషయాన్ని పంచుకున్న పాండ్యా వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనే రహస్యాన్ని క్రిక్‌బజ్ ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నాడు. తనుకు తానుగా నటాషాతో మాట్లాడే వరకు తాను ఎవరో కూడా ఆమెకు తెలీదని హర్ధిక్ చెప్పాడు. ఆమెతో మొదట తానే మాటలు కలిపానని, ఆ తరువాత ఇద్దరి మధ్య పరిచయం, స్నేహం, డేటింగ్ వరకు తీసుకెళ్లిందని ప్రేమ రహస్యం గుట్టు విప్పాడు. అయితే అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నెత్తిన టోపీ, మెడలో చైన్, వాచ్‌తో కనిపించడాన్ని చూసి.. ఈ వింత మనిషి ఎవరు? అని నటాషా అనుకుంది అంటూ చెప్పుకొచ్చాడు. (తండ్రి కాబోతున్న హార్దిక్ పాండ్యా)
ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య అనుబంధ మరింత పెరగడంతో డిసెంబర్ 31న తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు హర్ధిక్ వెల్లడించారు. అయితే ఒక్క రోజు ముందు రాత్రి ఆ విషయాన్ని సోదరుడు కృనాల్ పాండ్యాతో పంచుకున్నట్లు తెలిపాడు. నటాషా విషయంలో తన కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రోత్సాహం లభించిందని, తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులంతా గౌరవించారని పాండ్యా చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment