పాండ్యా అప్పుడలా.. ఇప్పుడిలా.. | Hardik Posts Throwback Picture Celebrating 2011 World Cup | Sakshi
Sakshi News home page

అప్పుడు అభిమానిగా.. ఇప్పుడు ఆటగాడిగా

Published Sat, May 25 2019 5:01 PM | Last Updated on Wed, May 29 2019 2:38 PM

Hardik Posts Throwback Picture Celebrating 2011 World Cup - Sakshi

ఎయిట్‌ ఇయర్స్ చాలెంజ్‌ అంటే ఇదీ.. 2011లో సగటు భారత క్రికెట్‌ అభిమానిలా.. 2019లో భారత జట్టులో సభ్యుడిగా..! నాడు ధోని సేన వరల్డ్‌ కప్‌ గెలిచినప్పుడు స్నేహితులతో సంబరాలు చేసుకున్న ఆ కుర్రాడు, ఇప్పుడు అదే ధోనితో కలిసి మరో ప్రపంచకప్‌ ఆడేందుకు సిద్దమయ్యాడు. టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఈ ఫోటోను పోస్ట్‌ చేసి తన జ్ఞాపకాలు పంచుకున్నాడు. 

హైదరాబాద్‌: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పిటకప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా పోస్ట్‌ చేసిన ఓ ఫోటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. క్షణాల్లోనే వేల లైకులు, షేర్లు వచ్చాయి.
హార్దిక్‌ షేర్‌ చేసిన ఫోటోల ఏముందంటే.. టీమిండియా 2011లో ప్రపంచకప్‌ గెలిచిన అనంతరం స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకుంటున్న ఫోటో.. ప్రసుతం ప్రపంచకప్‌ 2019లో టీమిండియా సభ్యుడిగా ఉన్న ఫోటోను షేర్‌ చేశాడు హార్దిక్‌ పాండ్యా. అప్పుడు ధోని సేన ప్రపంచకప్‌ గెలిచాక సంబరాలు చేసుకుంటుండగా.. తాజాగా అదే ధోనితో కలిసి ప్రపంచకప్‌ ఆడేందుకు సిద్దమయ్యాడు. ‘ఇది కదా మార్పు అంటే’, ‘ఎనిమిది సంవత్సరాల్లో ఎంత మార్పు’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో తొలి సమరానికి సిద్దంకానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement