
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తన ఖాతాలో మరో ‘డ్రా’ నమోదు చేసింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో శనివారం జరిగిన మూడో రౌండ్ రెండో గేమ్‌ను హారిక 29 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.
దాంతో నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరు 1–1తో సమమయ్యారు. ఫలితంగా వీరిద్దరిలో విజేతను నిర్ణయించేందుకు ఆదివారం టైబ్రేక్‌ను నిర్వహిస్తారు. తొలి రెండు రౌండ్‌లలో కూడా హారిక టైబ్రేక్ ఆధారంగానే విజయం సాధించింది. మరి మూడో రౌండ్‌లో ఆమెకు ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment