Harmanpreet Kaur, Smriti Mandhana Letter to BCCI About Continuation on Ramesh Power as a Coach for Next T20 - Sakshi
Sakshi News home page

కోచ్‌గా పొవార్‌నే కొనసాగించండి: హర‍్మన్‌ లేఖ

Published Tue, Dec 4 2018 10:29 AM | Last Updated on Tue, Dec 4 2018 12:12 PM

Harmanpreet Kaur, Smriti Mandhana bat for Ramesh Powar’s continuation as coach - Sakshi

న్యూఢిల్లీ: మహిళల క్రికెట్‌ జట్టుకు నూతన కోచ్‌ కోసం ఇటీవల బీసీసీఐ ప్రకటన విడుదల చేయడంతో ఇక రమేశ్‌ పొవార్‌కు ద్వారాలు మూసుకుపోయినట్టే అని అంతా భావించారు. కోచ్‌గా అతనికిచ్చిన గడువు క్రితం నెల 30వ తేదీతో ముగిసిపోవడంతో కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ క్రమంలోనే మిథాలీ రాజ్‌తో వివాదం కారణంగా పొవార్‌ మళ్లీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు లేవనే వాదన వినిపించింది. అయితే  తాజాగా టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌,  స్టార్‌ క్రీడాకారిణి స్మృతి మంధన జోడీ పొవార్‌కు మద్దతుగా నిలిచింది. అతడి ఆధ్వర్యంలో జట్టు మెరుగ్గా ఆడిందని కోచ్‌గా మరికొంత కాలం కొనసాగించాలని వీరిద్దరు బోర్డుకు లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
 

గత నెల 30తో పొవార్‌తో ఒప్పందం ముగిసింది. దీన్ని పొడిగించేందుకు బీసీసీఐ కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, మంధన మాత్రం తమకు కోచ్‌గా రమేశ్‌ పొవారే కొనసాగాలంటూ బోర్డుకు విడిగా లేఖ రాశారు. వచ్చే టీ20 ప్రపంచకప్‌ వరకు అతడికే బాధ్యతలు అప్పగిస్తే మంచిదని కోరారు. అలాగే మిథాలీని ఆడించకపోవడంపై కూడా లేఖలో వివరించారు. ‘కొన్ని నెలలుగా మా జట్టు ఆటతీరులో ఎలాంటి మార్పు వచ్చిందో మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ప్రపంచ టాప్‌ జట్లకు దీటుగా ప్రదర్శన ఇవ్వగలిగాం. దీనికంతటికీ కారణం రమేశ్‌ పొవార్‌ శిక్షణే. స్వల్పకాలంలోనే ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు సాంకేతికంగా, వ్యూహాత్మకంగా భారత మహిళల జట్టును సమూలంగా మార్చా డు.

  

ఇక సెమీస్‌లో ఓటమితో పాటు ఆ మ్యాచ్‌ చుట్టూ వివాదాలు నెలకొనడం మరింతగా బాధించింది. మిథాలీని తప్పించడం జట్టు వ్యూహంలో భాగంగానే జరిగింది. కెప్టెన్‌గా నేను, వైస్‌కెప్టెన్‌, కోచ్‌, సెలెక్టర్‌ అంతాకలిసి మేనేజర్‌ సమక్షంలో ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమది. వచ్చే టీ20 ప్రపంచక్‌పకు మరో 15 నెలల సమయమే ఉంది. మరో నెలలో న్యూజిలాండ్‌ టూర్‌కు వెళ్లాలి. ఈనేపథ్యంలో జట్టు ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని మరో కొత్త కోచ్‌ కాకుండా పొవార్‌నే కొనసాగించాలని కోరుకుంటున్నాను’ అని లేఖలో హర్మన్‌ప్రీత్‌ పేర్కొన్నారు. అటు స్మృతి కూడా పొవార్‌ ఆధ్వర్యంలోనే తమ జట్టు వరుసగా 14 టీ20 మ్యాచ్‌లను నెగ్గిందని గుర్తుచేసింది. అందుచేత పొవార్‌ను కోచ్‌గా కొనసాగించాలంటూ పేర్కొన్నారు.

కొమ్ముల్ని కనిపెట్టలేకపోవడం.. నాట్‌ ఎ గుడ్‌ లీడర్‌షిప్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement