జాతీయ చెస్ విజేత హర్షిత
బాలుర విభాగం రన్నరప్ అర్జున్
న్యూఢిల్లీ: జాతీయ సబ్ జూనియర్ అండర్-15 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు మెరిశారు. బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జి.హర్షిత చాంపియన్‌గా అవతరించగా... బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన ఎరిగైసి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మారుు తోషాలి (8 పారుుంట్లు) మూడో స్థానంలో నిలిచింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హర్షిత, వంతిక అగర్వాల్ (ఢిల్లీ) 9 పారుుంట్లతో సమఉజ్జీగా నిలిచారు. అరుుతే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హర్షితకు టైటిల్ ఖాయమైంది. ఈ టోర్నీలో హర్షిత ఎనిమిది గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోరుుంది. బాలుర విభాగంలో అర్జున్ 9 పారుుంట్లు నెగ్గి రెండో స్థానంలో నిలిచాడు. 9.5 పారుుంట్లతో మిత్రబా గుహ (బెంగాల్) అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
మరోవైపు లక్నోలో ముగిసిన జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో అరవింద్ చిదంబరం (తమిళనాడు-8.5 పారుుంట్లు) విజేతగా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధూళిపాళ్ల బాలచంద్ర ప్రసాద్ (4.5 పారుుంట్లు) పదో స్థానంలో, తెలంగాణ ఆటగాడు ప్రణీత్ సూర్య (1 పారుుంట్) 13వ స్థానంలో నిలిచారు.