Girls Section
-
జాతీయ చెస్ విజేత హర్షిత
బాలుర విభాగం రన్నరప్ అర్జున్ న్యూఢిల్లీ: జాతీయ సబ్ జూనియర్ అండర్-15 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు మెరిశారు. బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జి.హర్షిత చాంపియన్‌గా అవతరించగా... బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన ఎరిగైసి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మారుు తోషాలి (8 పారుుంట్లు) మూడో స్థానంలో నిలిచింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హర్షిత, వంతిక అగర్వాల్ (ఢిల్లీ) 9 పారుుంట్లతో సమఉజ్జీగా నిలిచారు. అరుుతే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హర్షితకు టైటిల్ ఖాయమైంది. ఈ టోర్నీలో హర్షిత ఎనిమిది గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోరుుంది. బాలుర విభాగంలో అర్జున్ 9 పారుుంట్లు నెగ్గి రెండో స్థానంలో నిలిచాడు. 9.5 పారుుంట్లతో మిత్రబా గుహ (బెంగాల్) అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు లక్నోలో ముగిసిన జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో అరవింద్ చిదంబరం (తమిళనాడు-8.5 పారుుంట్లు) విజేతగా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధూళిపాళ్ల బాలచంద్ర ప్రసాద్ (4.5 పారుుంట్లు) పదో స్థానంలో, తెలంగాణ ఆటగాడు ప్రణీత్ సూర్య (1 పారుుంట్) 13వ స్థానంలో నిలిచారు. -
వాలీబాల్ చాపియన్లుగా వైజాగ్, ప్రకాశం
- రన్నరప్‌లుగా కృష్ణా, పశ్చిమగోదావరి జట్లు - ట్రోఫీలు అందజేసిన అతిథులు కడప స్పోర్ట్స్: ఏపీ జూనియర్ వాలీబాల్ చాపియన్‌షిప్ విజేతలుగా బాలికల విభాగంలో వైజాగ్ జట్టు విజేతగా, బాలుర విభాగంలో ప్రకాశం జట్టు విజేతగా నిలిచింది. విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీలను ఆదివారం రాత్రి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వాలీబాల్ అసోసియేషన్ చైర్మన్ కందుల శివానందరెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లాలో వాలీబాల్ పోటీలు చక్కగా నిర్వహించగలిగామన్నారు. అధికారులు, నిర్వాహకులు సహకరిస్తే భవిష్యత్తులో జాతీయస్థాయి పోటీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. డీఎస్డీఓ లక్ష్మినారాయణశర్మ మాట్లాడుతూ 40 సంవత్సరాల తర్వాత కడపలో మళ్లీ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన బీజేవైఎం జాతీయ కార్యవర్గసభ్యుడు నాగోతు రమేష్‌నాయుడు మాట్లాడుతూ నేడు యువత చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకంగా ఉందన్నారు. కార్యక్రమంలో సీఐడీ డీఎస్పీ శ్రీరాం రామ్మోహన్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు సరోజ, కార్యదర్శి షామీర్‌బాషా, ఉపాధ్యక్షుడు మాలకొండయ్య, సలహాదారు మొగిలి నారాయణ, సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. బాలికల విజేతగా విశాఖ జట్టు.. బాలికల విభాగంలో నిర్వహించిన తొలి సెమీఫైనల్లో కృష్ణా జట్టు 30 తేడాతో కర్నూలు జట్టుపై విజయం సాధించింది. రెండవ సెమీఫైనల్లో విశాఖ జట్టు గుంటూరుపై 30 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరాయి. ఫైనల్ మ్యాచ్‌లో వైజాగ్ జట్టు 2512, 2513, 2513 వరుస సెట్లతో కృష్ణాజట్టుపై విజయం సాధించి 30 తేడాతో విజయం సాధించి ఛాంపియన్ నిలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. బాలుర విజేతగా ప్రకాశం జట్టు.. బాలుర విభాగంలో నిర్వహించిన తొలి సెమీఫైనల్లో పశ్చిమగోదావరి జట్టు 31 తేడాతో గుంటూరుపై విజయం సాధించింది. రెండవ సెమీఫైనల్లో ప్రకాశం జట్టు కడప జట్టుపై 30 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరాయి. -
వరంగల్ జట్ల విజయకేతనం
=ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ అండర్-19 పోటీలు =బాలికల విభాగంలో ప్రథమ స్థానం =బాలురలో రెండో స్థానం వరంగల్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : రాష్ట్రస్థాయి అండర్-19 జూనియర్ కళాశాల కబడ్డీ పోటీల్లో వరంగల్ జట్లు హవా కొనసాగించాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానం నిలవగా, బాలుర విభాగంలో రెండో స్థానం సాధించింది. వరంగల్‌లోని రంగశాయిపేటలో మూడు రోజులుగా జరిగిన అండర్-19 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో బాలుర విభాగంలో ప్రకాశం జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, వరంగల్ జట్టు రెండో స్థానం సాధించింది. బాలికల విభాగంలో వరంగల్ జట్టు ప్రథమ స్థానం, విశాఖపట్నం ద్వితీయ బహుమతి అందుకుంది. బాలికల ఫైనల్ విభాగంలో వరంగల్ 49-18తేడాతో విశాఖపట్నంపై జయకేతనం ఎగురవేసింది. బాలుర ఫైనల్ విభాగంలో ప్రకాశం జట్టు 43-13 తేడాతో వరంగల్‌పై విజయం సాధించింది. జాతీయస్థాయిలో రాణించాలి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించి జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లో రాణించి జిల్లా కీర్తిని చాటాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. వరంగల్‌లోని రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-19 కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి డీవీఈఓ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మంత్రి సారయ్యతో పాటు, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సమయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇవే చివరివని అన్నారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అన్ని రంగాల్లో వరంగల్ జిల్లా ముందుంటుందని, క్రీడల్లో కూడా ముందుంజలో ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ఐ అండర్-19 జిల్లా సెక్రటరీ రామ్మూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్‌చైర్మన్ సారయ్య, నాయిని అశోక్, కేడల పద్మ, పోషాల పద్మ, ఎంబాడి రవీందర్, ఎం.వెంకటేశ్వరరావు, పెటా పీఈటీ సంఘం జిల్లా కార్యదర్శి కత్తి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.