వాలీబాల్ చాపియన్‌లుగా వైజాగ్, ప్రకాశం
- రన్నరప్‌లుగా కృష్ణా, పశ్చిమగోదావరి జట్లు
- ట్రోఫీలు అందజేసిన అతిథులు
కడప స్పోర్ట్స్: ఏపీ జూనియర్ వాలీబాల్ చాపియన్‌షిప్ విజేతలుగా బాలికల విభాగంలో వైజాగ్ జట్టు విజేతగా, బాలుర విభాగంలో ప్రకాశం జట్టు విజేతగా నిలిచింది. విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీలను ఆదివారం రాత్రి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వాలీబాల్ అసోసియేషన్ చైర్మన్ కందుల శివానందరెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లాలో వాలీబాల్ పోటీలు చక్కగా నిర్వహించగలిగామన్నారు. అధికారులు, నిర్వాహకులు సహకరిస్తే భవిష్యత్తులో జాతీయస్థాయి పోటీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. డీఎస్‌డీఓ లక్ష్మినారాయణశర్మ మాట్లాడుతూ 40 సంవత్సరాల తర్వాత కడపలో మళ్లీ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన బీజేవైఎం జాతీయ కార్యవర్గసభ్యుడు నాగోతు రమేష్‌నాయుడు మాట్లాడుతూ నేడు యువత చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకంగా ఉందన్నారు. కార్యక్రమంలో సీఐడీ డీఎస్పీ శ్రీరాం రామ్మోహన్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు సరోజ, కార్యదర్శి షామీర్‌బాషా, ఉపాధ్యక్షుడు మాలకొండయ్య, సలహాదారు మొగిలి నారాయణ, సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
బాలికల విజేతగా విశాఖ జట్టు..
బాలికల విభాగంలో నిర్వహించిన తొలి సెమీఫైనల్‌లో కృష్ణా జట్టు 30 తేడాతో కర్నూలు జట్టుపై విజయం సాధించింది. రెండవ సెమీఫైనల్‌లో విశాఖ జట్టు గుంటూరుపై 30 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరాయి. ఫైనల్ మ్యాచ్‌లో వైజాగ్ జట్టు 2512, 2513, 2513 వరుస సెట్లతో కృష్ణాజట్టుపై విజయం సాధించి 30 తేడాతో విజయం సాధించి ఛాంపియన్ నిలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది.
బాలుర విజేతగా ప్రకాశం జట్టు..
బాలుర విభాగంలో నిర్వహించిన తొలి సెమీఫైనల్‌లో పశ్చిమగోదావరి జట్టు 31 తేడాతో గుంటూరుపై విజయం సాధించింది. రెండవ సెమీఫైనల్‌లో ప్రకాశం జట్టు కడప జట్టుపై 30 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరాయి.