హెచ్‌సీఏ బౌలింగ్ కన్సల్టెంట్‌గా అక్రమ్! | HCA bowling consultant Akram! | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఏ బౌలింగ్ కన్సల్టెంట్‌గా అక్రమ్!

Published Mon, Feb 9 2015 12:59 AM | Last Updated on Sat, Mar 23 2019 8:23 PM

హెచ్‌సీఏ బౌలింగ్ కన్సల్టెంట్‌గా అక్రమ్! - Sakshi

హెచ్‌సీఏ బౌలింగ్ కన్సల్టెంట్‌గా అక్రమ్!

 హైదరాబాద్: పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ వచ్చే సీజన్‌లో హైదరాబాద్ రంజీ జట్టుకు బౌలింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ మేరకు హెచ్‌సీఏ అధికారులు ఇప్పటికే అతనితో ఒక దఫా చర్చలు జరిపారు. ప్రపంచకప్ సందర్భంగా కామెంటేటర్‌గా వ్యవహరిస్తూ ప్రస్తుతం అక్రమ్ ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు.
 
 ఈ టోర్నీకి భారత జట్టు మేనేజర్‌గా వ్యవహరించనున్న హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్... ఆస్ట్రేలియాలో అక్రమ్‌తో మరో విడత చర్చలు జరుపుతారు. ఐపీఎల్‌లో అక్రమ్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. రంజీల్లో హైదరాబాద్ జట్టు ప్రదర్శన మూడేళ్లుగా పేలవంగా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement