'ఆ అమ్మాయితో నిశ్చితార్థం జరగలేదు' | Hockey skipper Sardar Singh denies engagement with UK woman | Sakshi
Sakshi News home page

'ఆ అమ్మాయితో నిశ్చితార్థం జరగలేదు'

Published Wed, Feb 3 2016 2:27 PM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM

'ఆ అమ్మాయితో నిశ్చితార్థం జరగలేదు'

'ఆ అమ్మాయితో నిశ్చితార్థం జరగలేదు'

చండీగఢ్: తనతో నిశ్చితార్థం జరిగిందని, పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడంటూ భారత సంతతికి చెందిన బ్రిటన్ అమ్మాయి చేసిన ఆరోపణలను భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ ఖండించాడు. తనకు బ్రిటన్ అమ్మాయితో నిశ్చితార్థం జరగలేదని సర్దార్ స్పష్టం చేశాడు. కాగా ఆ అమ్మాయి తనకు తెలియదని చెప్పలేదు. 'ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదును చూడాలి. ఆ తర్వాత సమాధానమిస్తా. నిన్న గేమ్ ఆడి వస్తున్నా. తర్వాతి జరిగే గేమ్పై దృష్టిసారించాలి' అని చండీగఢ్ విమానాశ్రయంలో సర్దార్ చెప్పాడు.  

సర్దార్ సింగ్ తనపై అత్యాచారయత్నం చేశాడని బ్రిటన్కు చెందిన అమ్మాయి లుధియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తామిద్దరికీ నిశ్చితార్థం జరిగిందని, అయితే పెళ్లి చేసుకోవడానికి సర్దార్ సింగ్ నిరాకరించాడని ఆరోపించింది. 'సర్దార్ బ్లాక్ మెయిల్ చేశాడు. మానసికంగా, శారీరకంగా వేధించాడు' అని ఆరోపించింది. సర్దార్ తండ్రి గుర్నం సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడికి ఆ అమ్మాయి తెలుసునని, అయితే నిశ్చితార్థం జరగలేదని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement