ఈసారీ పాక్‌ను చితక్కొట్టారు | Hockey World League Semi- Final: India humble Pakistan 6-1 | Sakshi
Sakshi News home page

ఈసారీ పాక్‌ను చితక్కొట్టారు

Published Sun, Jun 25 2017 1:12 AM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

ఈసారీ పాక్‌ను చితక్కొట్టారు

ఈసారీ పాక్‌ను చితక్కొట్టారు

భారత్‌ 6–1తో ఘనవిజయం
హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్స్‌
 
లండన్‌: పాకిస్తాన్‌ హాకీ జట్టుకు భారత్‌ మరోసారి దిమ్మ తిరిగేలా షాక్‌ ఇచ్చింది. హాకీ వరల్డ్‌ లీగ్‌ (డబ్ల్యూహెచ్‌ఎల్‌)లో భాగంగా శనివారం 5 నుంచి 8 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చూపిన భారత్‌ 6–1 గోల్స్‌ తేడాతో దాయాది పాక్‌ను చిత్తు చేసింది. రమణ్‌దీప్‌ సింగ్‌ (8వ, 28వ నిమిషాల్లో) సూపర్‌ షో ప్రదర్శించగా తల్వీందర్‌ సింగ్‌ (25వ ని.లో), మన్‌దీప్‌ సింగ్‌ (27వ, 59వ ని.లో), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (36వ ని.లో) మిగతా గోల్స్‌తో భారీ విజయానికి సహకరించారు.

పాక్‌ నుంచి ఎజాజ్‌ అహ్మద్‌ (41) ఏకైక గోల్‌ చేశాడు. ఈ ఓటమితో భారత్‌లో వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో పాక్‌ ఆడే అవకాశాలు సన్నగిల్లాయి. ఇక భారత్‌ 5–6 స్థానాల కోసం ఆదివారం కెనడాతో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్‌ దశలోనూ భారత్‌ 7–1తో పాక్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.

భారత్‌ vs కెనడా
నేడు సా.గం. 4.15 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement