ఒకే పూల్ లో భారత్, పాక్
హాకీ వరల్డ్ లీగ్
లండన్: వచ్చే ఏడాది జరిగే హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్ ఈవెంట్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే పూల్‌లో తలపడనున్నారుు. లండన్‌లో పురుషుల విభాగంలో జరిగే ఈ టోర్నీలో దాయాది జట్లతోపాటు నెదర్లాండ్‌స పూల్ ‘బి’లో చోటు దక్కించుకుంది. జూన్ 15 నుంచి 25 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ జూన్ 18న జరుగుతుంది. హెచ్‌డబ్ల్యూఎల్ టోర్నీని భారత్ ఆతిథ్యమివ్వనున్న 2018 ప్రపంచకప్‌కు క్వాలిఫరుుంగ్ ఈవెంట్‌గా పరిగణిస్తున్నారు.
ఆతిథ్య ఇంగ్లండ్, ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా సహా నెదర్లాండ్‌స, కొరియా, భారత్, పాక్ జట్లు నేరుగా ప్రధాన ఈవెంట్‌లో తలపడతారుు. మరో నాలుగు జట్లు మాత్రం హెచ్‌డబ్ల్యూఎల్ రెండో రౌండ్ క్వాలిఫరుుంగ్ పోటీల ద్వారా అర్హత సాధిస్తారుు. ఈ ఏడాది పాక్‌ను ఓడించి ఆసియా చాంపియన్‌సగా నిలిచిన భారత్ ఇదే జోరును నిలకడగా కొనసాగిస్తే హెచ్‌డబ్ల్యూఎల్‌లోనూ చిరకాల ప్రత్యర్థిని కంగుతినిపించేదుకు అవకాశముంటుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ మ్యాచ్‌పై అంచనాలు పెరుగుతారుు.