సెమీస్ స్థానంపై ఇంగ్లండ్ గురి
కార్డిఫ్: చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య ఇంగ్లండ్ సెమీ ఫైనల్ స్థానంపై గురిపెట్టింది. ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచిన ఇంగ్లండ్.. వరుసగా రెండో మ్యాచ్ లో కూడా విజయం సాధించి సెమీస్ బెర్తును ఖరారు చేసుకోవాలని చూస్తోంది. దానిలో భాగంగా గ్రూప్-ఎలో మంగళవారం న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ విజయంపై దృష్టి సారించింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ కు మొగ్గుచూపాడు. ఇదిలా ఉంచితే, చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఆడిన ముందు మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో ఇంగ్లండ్ తో పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో న్యూజిలాండ్ కు విజయం తప్పనిసరి. అప్పుడే న్యూజిలాండ్ కు సెమీస్ చేరే అవకాశాలుంటాయి. ఆసీస్ ను వెనుక్కునెట్టి ముందుకు వెళ్లాలంటే కివీస్ కు విజయం అనివార్యం. ఒకవేళ తాజా మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కల్గిస్తే న్యూజిలాండ్ కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక్కడ ఆస్ట్రేలియా ఆడిన రెండు మ్యాచ్ లు రద్దయిన సంగతి తెలిసిందే. దాంతో ఆస్ట్రేలియా కేవలం రెండు పాయింట్లను మాత్రమే సాధించి రెండో స్థానంలో ఉంది.
ఇంగ్లండ్ తుదిజట్టు:ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జాసన్ రాయ్, హేల్స్ , జో రూట్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, మొయిన్ అలీ, రషిద్, ప్లంకెట్, మార్క్ వుడ్, జాక్ బాల్
న్యూజిలాండ్ తుదిజట్టు: కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, ల్యూక్ రోంచీ, రాస్ టేలర్, బ్రూమ్, నీషమ్, కోరీ అండర్సన్, సాంట్నార్, మిల్నే, సౌథీ, ట్రెంట్ బౌల్ట్