హైదరాబాద్ తడబాటు hyderabad faces struggle against maharashtra in ck naidu trophy | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ తడబాటు

Published Thu, Oct 27 2016 10:42 AM

hyderabad faces struggle against maharashtra in ck naidu trophy

సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు అండర్-23 (ఎలైట్ గ్రూప్ ‘సి’) టోర్నీలో మహారాష్ట్రతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్లో తడబడుతోంది. బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్ లో 28 ఓవర్లలో 3 వికెట్లకు 54 పరుగులు చేసింది.

 

రోహిత్ రాయుడు 23, చైతన్య రెడ్డి 22 పరుగులు చేశారు. అంతకుముందు 192/3 స్కోరుతో బుధవారం ఆట ప్రారంభించిన మహారాష్ట్ర తొలి ఇన్నింగ్‌‌సలో 128.4 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌటైంది. దీంతో మహారాష్ట్ర 108 పరుగుల తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యాన్ని సంపాదించింది. వై.జె. షేక్ (113) సెంచరీతో, ఎస్. ఎం. ఖాజి (67) అర్ధసెంచరీలతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ 3, తనయ్ త్యాగరాజన్ 4 వికెట్లు పడగొట్టారు. హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 304 పరుగులు చేసింది.    
 

 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement