సాక్షి, హైదరాబాద్: మహిళల క్రికెట్ అండర్-19 జోనల్ లీగ్‌లో హైదరాబాద్ జట్టు మరో విజయాన్ని సాధించింది. తమిళనాడుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 135 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. త్రిష (35), కీర్తి (37), పూజ (32), చిత్ర (40) బ్యాటింగ్‌లో రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో శ్వేత 3 వికెట్లతో రాణించింది. అనంతరం 205 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన తమిళనాడు జట్టు 37.2 ఓవర్లలో 69 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో ఫ్లవియా పెరీరా, శ్రవీణ, లక్ష్మిప్రసన్న, పూజ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
ఆంధ్ర: 253/7 (దుర్గ 32, అనూష 74, పద్మజ 23, పుష్పలత 71నాటౌట్; దీక్ష 4/62), గోవా: 63 (ప్రవళిక 2/16, భావన 2/16, శ్రీలేఖ 2/13).
కర్నాటక: 230/7 (శుభ 102, కె. ప్రత్యూష 30, సి. ప్రత్యూష 57; మిన్ను మణి 4/42), కేరళ: 192/6 (అక్షయ 60, దృశ్య 42, ప్రత్యూష 4/23).
హైదరాబాద్ ఘన విజయం
Published Sat, Nov 12 2016 10:28 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement