హైదరాబాద్‌ ‘ఎ’కు మరో విజయం | Hyderabad A wins another victory in veteran cricket tournament | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ‘ఎ’కు మరో విజయం

Published Sun, Mar 25 2018 10:38 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

 Hyderabad A wins another victory in veteran cricket tournament

సాక్షి, హైదరాబాద్‌: మాన్‌సింగ్‌–గంగరాజు వెటరన్‌ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ‘ఎ’ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. జింఖానా మైదానంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గుంటూరు వెటరన్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన గుంటూరు జట్టు 18 ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది. మనోజ్‌ సాయి (76) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్‌ బౌలర్లలో చంద్రశేఖర్‌ 2 వికెట్లు పడగొట్టగా, అభిషేక్, స్వరూప్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం హైదరాబాద్‌ ‘ఎ’ జట్టు 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి గెలుపొందింది. గిరి (45), రజనీకాంత్‌ (40) చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లలో మనోజ్‌ సాయికి 2 వికెట్లు దక్కాయి.  

ఇతర మ్యాచ్‌ల వివరాలు

గుంటూరు వెటరన్స్‌: 160/6 (మనోజ్‌ సాయి 43, విన్సెంట్‌ 41; ఖాదర్‌ 3/20, శ్రీనివాస్‌ 1/29), కడప మాస్టర్స్‌: 138/9 (ఖాదర్‌ 32, ఖాజా 23; మనోజ్‌ సాయి 3/13, అమన్‌ 2/20, శరత్‌ కుమార్‌ 2/24).   

అనంతపురం: 176/7 (షాబుద్దీన్‌ 89, మున్నా 25; శ్రీకాంత్‌ 3/32), హైదరాబాద్‌ ‘బి’: 126/9 (శ్రీకాంత్‌ 21, భక్తియార్‌ 20; ఇనాయత్‌ 2/16, పాణి 2/17, హరినాథ్‌ రెడ్డి 2/23).  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement