అజీజుద్దీన్‌ సెంచరీ | hyderabad bowled out at 304 | Sakshi
Sakshi News home page

అజీజుద్దీన్‌ సెంచరీ

Published Thu, Jan 11 2018 10:27 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

hyderabad bowled out at 304 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సౌత్‌జోన్‌ అండర్‌–14 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ సయ్యద్‌ అజీజుద్దీన్‌ (155 బంతుల్లో 101; 15 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అజీజ్‌ అద్భుత ప్రదర్శనతో కేరళ వేదికగా గోవాతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి రోజు భారీస్కోరు సాధించింది.

మయాంక్‌ గుప్తా (112బంతుల్లో 68; 10 ఫోర్లు) కూడా అర్ధసెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 69 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. ఎన్‌. రిషిత్‌ రెడ్డి (40) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో దీపక్‌ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన గోవా జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో 4 వికెట్లకు 22 పరుగులతో నిలిచింది. హైదరాబాద్‌ బౌలర్‌ రిషిత్‌ రెడ్డి (3/6) గోవాకు షాకిచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement