సెంచరీ, డబుల్ సెంచరీ ప్రతీసారి ఆశిస్తే ఎలా..?
తన ఫామ్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత ఆటగాడు చతేశ్వర్ పుజారా అంటున్నాడు. గత కొన్ని మ్యాచులలో తన బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ లు రాలేదన్నది వాస్తవమేనని... కఠిన పరిస్థితుల్లోనూ తాను సెంచరీ, డబుల్ సెంచరీలు చేశానని ఎప్పుడూ ఆలాంటి ఆట ఆశించడమేనా అంటూ పుజారా ప్రశ్నించాడు. హాఫ్ సెంచరీ చేసి ఆరు ఇన్నింగ్స్ లు అయిందనీ, ఇతర ఆటగాళ్లతో కలిసి స్ట్రైక్ రొటేట్ చేస్తూ భాగస్వామ్యాలలో పాలుపంచుకున్న విషయాన్ని గుర్తుచేశాడు. జట్టు విజయాలలో తనవంతు పాత్ర పోషిస్తున్నానని, తన ఫామ్ గురించి ఆందోళన అక్కర్లేదన్నాడు.
దక్షిణాఫ్రికా లాంటి చాలెంజింగ్ వికెట్ పిచ్ లలో తాను రాణించానని, భారీ స్కోర్లు చేశానని వ్యాఖ్యానించాడు. 'గత టెస్ట్ మ్యాచ్ లో మంచి సమయంలో చెత్త షాట్ ఆడి అవుటయ్యాను. తొలి సెషన్లో బంతి చాలా మందకొడిగా వస్తుంటే ఆడటం కష్టం' అని పుజారా పేర్కొన్నాడు. తన బ్యాటింగ్ లోపాలపై కోచ్ అనిల్ కుంబ్లేతో చర్చించానని, విండీస్ ను వైట్ వాష్ చేయడమే ప్రస్తుతం టీమిండియా ముందున్న లక్ష్యమని చెప్పుకొచ్చాడు.