స్టుట్గార్ట్: ఇటీవల జరిగిన క్లే కోర్టు గ్రాండ్ స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్కు గాయం కారణంగా దూరమైన స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్.. త్వరలో ఆరంభం కానున్న గ్రాస్ కోర్టు సీజన్కు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. గత మూడు వారాల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పూర్తి ఫిట్నెస్తో ఉన్నానని తాజాగా ఫెదరర్ తెలిపాడు.
గ్రాస్ కోర్టు టోర్నీలో భాగంగా మెర్సిడెస్ కప్లో ఫెదరర్కు బై లభించడంతో నేరుగా రెండో రౌండ్ నుంచి పోటీ మొదలు పెట్టనున్నాడు. ఇప్పటికే 17 గ్రాండ్ స్లామ్లు గెలిచిన ఫెదరర్.. ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన నొవాక్ జొకోవిచ్ ను ప్రశంసించాడు. జొకోవిచ్ గెలుపు టెన్నిస్ కే ఒక అద్భుతమని, వరల్డ్ క్లాస్ అని కొనియాడాడు.