నేను ఇంకా ప్రూవ్‌ చేసుకోవాలి: ఏబీ | I needed to prove myself, says AB de Villiers | Sakshi
Sakshi News home page

నేను ఇంకా ప్రూవ్‌ చేసుకోవాలి: ఏబీ

Published Mon, Mar 12 2018 5:35 PM | Last Updated on Mon, Mar 12 2018 9:42 PM

I needed to prove myself, says AB de Villiers - Sakshi

పోర్ట్‌ ఎలిజబెత్‌: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి దక్షిణాఫ్రికాను ఆధిక్యంలో నిలిపిన ఆ జట్టు స్టార్‌ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. అయితే తనను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఏబీ స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికా జట్టులో తన విలువను కాపాడుకోవాలంటే మెరుగైన ప్రదర్శనలు ఎంతైనా అవసరమన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏబీ డివిలియర్స్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండి 126 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా కష్టాల్లో పడ్డ తరుణంలో ఏబీ బాధ్యతాయుతంగా ఆడి జట్టు పరిస్థితిని చక‍్కదిద్దాడు.

దీనిపై మాట్లాడిన ఏబీ..' నేను ఇంకా గేమ్‌ ఆడగలను అనడానికి ఈ ఇన్నింగ్స్‌ నాకు ప్రేరణ ఇచ్చింది. నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని బలంగా నమ్ముతున్నా. ఇటీవల కాలంలో నేను శారీరకంగా, మానసికంగా చాలా అలసిపోయా. ఇందుకు పలు కారణాలున్నాయి. నేను తండ్రిని కావడంతో పాటు, అనేక విషయాలు నా జీవితంలో చోటు చేసుకున్నాయి. తాజా ఇన్నింగ్స్‌తో కొద్ది పాటి ఊపిరి తీసుకున్నట్లయ్యింది. నాపై జట్టు మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని నిలబెట్టాలంటే కీలక ఇన్నింగ్స్‌లు ఆడి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది' అని ఏబీ తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement