మొరదాబాద్: బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో లేనని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాస్పష్టం చేశారు. శశాంక్ మనోహర్ కు తాను పూర్తి మద్దతు తెల్పుతున్నట్టు చెప్పారు. తాను ఎల్లప్పుడూ బోర్డుకు విధేయుడిగా ఉంటానని పేర్కొన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ రెండోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. అనురాగ్ ఠాకూర్, శరద్ పవార్ వర్గాలకు ఆమోదయోగ్యుడిగా ముద్ర పడడంతో మనోహర్ పునరాగమానికి మార్గం సుగమం అయింది.
అయితే రాజీవ్ శుక్లా పేరు కూడా తెరపైకి రావడంతో ఆయన వివరణ యిచ్చారు. తాను అధ్యక్ష పోటీలో లేనని, మనోహర్ కే మద్దతు పలుకుతున్నట్టు చెప్పారు. శశాంక్ నాయకత్వంలో బోర్డు పనితీరు మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
'మనోహర్ కే నా మద్దతు'
Published Thu, Oct 1 2015 12:44 PM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM
Advertisement
Advertisement