
కమల్ రాజీనామా ఆమోదం
దుబాయ్: అధ్యక్ష పదవికి ముస్తఫా కమల్ చేసిన రాజీనామాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఆమోదించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ బహూకరించే విషయంలో తనను పక్కకుపెట్టారన్న కారణంతో ముస్తఫా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్ సన్ కు రాజీనామా లేఖ పంపించారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని , తనకు అప్పగించిన బాధ్యతల నుంచి మధ్యలోనే వైదొలగుతున్నందుకు ఐసీసీ సభ్యులకు క్షమాపణ చెప్పారు. ఎవరి గురించి ఆయన ఫిర్యాదు చేయలేదు.