అమెరికా చేతిలో ఓడిన భారత్
మహిళల హాకీ
మన్‌హీమ్ (అమెరికా): భారత మహిళల హాకీ జట్టు తమ అమెరికా పర్యటనను ఓటమితో ఆరంభించింది. రియో ఒలింపిక్స్‌కు చివరి సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో 2-3 తేడాతో భారత్ ఓడింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ప్రీతి దూబే (33వ నిమిషంలో), దీపిక (38) గోల్స్ సాధించారు. అమెరికా నుంచి కథ్లీన్ షార్కే (6), కేటీ బామ్ (31), కెల్సీ కొలోజెచిక్ (48) గోల్స్ చేశారు. రేపు (గురువారం) అమెరికాతో రెండో మ్యాచ్ జరుగుతుంది.