second match
-
DT 2024: అనంతపురంలో దులిప్ ట్రోఫీ రెండో మ్యాచ్ (ఫొటోలు)
-
India vs South Africa 2nd T20: వరుణుడు కరుణిస్తేనే...
పోర్ట్ట్ ఎలిజబెత్: వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్‌కు ముందు అందుబాటులో ఉన్న ఈ కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లతో జట్టును సిద్ధం చేసుకోవాలని ఇటు భారత్, అటు దక్షిణాఫ్రికాలు చూస్తుంటే ప్రతికూల వాతావరణం పెను సమస్యగా మారింది. తొలి మ్యాచ్ వర్షంలో కోట్టుకుపోగా... ఇప్పుడు రెండో టి20కి కూడా వానముప్పు ఉండటం ఇరుజట్లకు ఇబ్బందిగా మారింది. జట్లకే కాదు... మ్యాచ్‌ల్ని అస్వాదించాలనుకున్న అభిమానులకు, రూ.కోట్లు గడించాలనుకున్న దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్ఏ)కు కూడా ఈ వాతావరణ పరిస్థితులు కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. కాబట్టి ఆలస్యంగా మొదలవనున్న రెండో మ్యాచ్‌కు వర్షం తెరిపినివ్వాలని అంతా కోరుకుంటున్నారు. కనీసం కుదించిన ఓవర్ల మ్యాచ్ జరిగినా మెరుపుల టి20ని చూడొచ్చని ఆశిస్తున్నారు. టాస్ పడితే... డర్బన్‌లో కనీసం టాస్ కూడా పడలేదు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగబోయే జట్లు టాస్ పడి ఆటకు బాట పడాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఆసీస్‌తో సొంతగడ్డపై యువభారత్‌ను నడిపించిన సూర్యకుమార్‌కు ఈ సిరీస్‌లో ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో పలువురు అనుభవజు్ఞలు శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, సిరాజ్‌లు జతవడంతో టీమిండియా క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఆ్రస్టేలియాపై అదరగొట్టిన రింకూ సింగ్, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్‌లు కూడా తమ ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నారు. కానీ వరుణుడు మాత్రం కరుణించడం లేదు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు కొత్త ముఖాలు మాథ్యూ బ్రీట్జ్కె, బర్గర్లను పరీక్షించాలనుకుంటే కుదరడం లేదు. దీంతో బవుమా లేని జట్టులో మార్క్రమ్ తన మార్క్ చూపించేందుకు అవకాశం చిక్కడం లేదు. మ్యాచ్ రోజు వానపడినా... మ్యాచ్ సమయానికల్లా తెరిపినిస్తే బాగుంటుంది. ఇదే జరిగితే ఇరుజట్లలోని యువ ఆటగాళ్లంతా కొండంత ఊరట పొంది ఆటపై దృష్టిపెడతారు. తమ సత్తా చాటుకునేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు. -
Ind Vs Wi 2nd T20: ఆఖరి 2 బంతుల్లోనూ సిక్స్‌లు కొట్టాలి.. హర్షల్ ఆ అవకాశం ఇవ్వలేదుగా!
రావ్మన్ పావెల్, నికోలస్ పూరన్ మెరుపు ప్రదర్శన భారత్‌ను ఓడించడానికి సరిపోలేదు. కీలక సమయంలో ఒత్తిడిని అధిగమించిన భారత్ ప్రత్యర్థిని కట్టడి చేసి వరుసగా రెండో విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. చివరి ఓవర్లో విండీస్ విజయానికి 25 పరుగులు కావాల్సి ఉండగా తొలి రెండు బంతుల్లో 2 పరుగులే వచ్చాయి. అయితే తర్వాతి రెండు బంతులను పావెల్ రెండు సిక్సర్లుగా మలచడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి రెండు బంతుల్లోనూ సిక్స్‌లు కొట్టాల్సిన స్థితిలో హర్షల్ ఆ అవకాశం ఇవ్వలేదు. అంతకుముందు పంత్, కోహ్లి జోరుతో భారత్ భారీ స్కోరుతో సవాల్ విసిరింది. India Vs West indies 2nd T20- కోల్‌కతా: వన్డే సిరీస్‌లాగే వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌ను కూడా భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 8 పరుగుల తేడాతో విండీస్‌ను ఓడించింది. టి20ల్లో భారత్‌కిది 100వ విజయం. ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పంత్ (28 బంతుల్లో 52 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (41 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ లు సాధించగా, వెంకటేశ్ అయ్యర్ (18 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 178 పరుగులు చేసింది. పావెల్ (36 బంతుల్లో 68 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), పూరన్ (41 బంతుల్లో 62; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 60 బంతుల్లోనే 100 పరు గులు జోడించినా జట్టును గెలిపించలేకపోయారు. మూడో టి20 ఆదివారం జరుగుతుంది. ఓపెనర్లు విఫలం... ఇషాన్ కిషన్ (2) తొలి ఓవర్లోనే అవుట్ కాగా... 2 పరుగుల వద్ద కింగ్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రోహిత్ శర్మ (19) కూడా ఆ అవకాశాన్ని పూర్తిగా వాడుకోలేకపోయాడు. కోహ్లి తాను ఆడిన తొలి 15 బంతుల్లోనే అతను ఆరు ఫోర్లు కొట్టడం విశేషం. ఛేజ్ బౌలింగ్‌లో బౌండరీ వద్ద హోల్డర్ క్యాచ్ వదిలేయగా, అది సిక్సర్‌గా మారడంతో 39 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే అదే ఓవర్లో కోహ్లి వెనుదిరిగాడు. ఆ తర్వాత పంత్, వెంకటేశ్ జోరు మొదలైంది. ఛేజింగ్‌లో పూరన్ తన తొలి ఐదు బంతుల్లోనే 2 ఫోర్లు, సిక్స్ కొట్టి వేగంగా ఇన్నింగ్స్ ఆరంభించగా, మరోవైపు పావెల్ కూడా ధాటిని ప్రదర్శించాడు. 10 ఓవర్లలో విండీస్ స్కోరు 73 పరుగులకు చేరింది. ఈ దశలో పూరన్, పావెల్ దూకుడు ప్రదర్శించడంతో తర్వాతి ఐదు ఓవర్లలోనే 51 పరుగులు వచ్చాయి. చహర్ ఓవర్లో కూడా రెండు సిక్స్‌లు బాదడంతో విండీస్ విజయ సమీకరణం 3 ఓవర్లలో 37 పరుగులకు చేరింది. ఇలాంటి స్థితిలో 18వ ఓవర్లో హర్షల్ 8 పరుగులే ఇవ్వగా, 19వ ఓవర్లో భువీ 4 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) కింగ్ (బి) ఛేజ్ 19; ఇషాన్ కిషన్ (సి) మేయర్స్ (బి) కాట్రెల్ 2; కోహ్లి (బి) ఛేజ్ 52; సూర్యకుమార్ (సి అండ్ బి) ఛేజ్ 8; పంత్ (నాటౌట్) 52; వెంకటేశ్ (బి) షెఫర్డ్ 33; హర్షల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–10, 2–59, 3–72, 4–106, 5–182. బౌలింగ్: హొసీన్ 4–0–30–0, కాట్రెల్ 3–1–20–1, హోల్డర్ 4–0– 45–0, షెఫర్డ్ 3–0–34–1, ఛేజ్ 4–0–25–3, స్మిత్ 1–0–10–0, పొలార్డ్ 1–0–14–0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (సి) సూర్యకుమార్ (బి) బిష్ణోయ 22; మేయర్స్ (సి అండ్ బి) చహల్ 9; పూరన్ (సి) బిష్ణోయ్ (బి) భువనేశ్వర్ 62; పావెల్ (నాటౌట్) 68; పొలార్డ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–34, 2–59, 3–159. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–29–1, దీపక్ చహర్ 4–0–40–0, చహల్ 4–0–31–1, హర్షల్ 4–0–46–0, రవి బిష్ణోయ్ 4–0–30–1. 🙌🙌#TeamIndia @Paytm #INDvWI pic.twitter.com/NjrkDCxt2q — BCCI (@BCCI) February 18, 2022 -
సిరీస్ గెలిచే లక్ష్యంతో...
రాంచీ: న్యూజిలాండ్‌తో తొలి టి20లో విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు సిరీస్ సొంత చేసుకోవడంపై దృష్టి పెట్టింది. నేడు జరిగే రెండో మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్ టీమిండియా చెంత చేరుతుంది. మరోవైపు టి20 ప్రపంచకప్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ ఇప్పుడు ఈ ద్వైపాక్షిక సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలిచేందుకు కావాల్సిన అస్త్రశస్త్రాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం. లోపాలను సరిదిద్దుకుంటూ... ఈ సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఇది బాగానే ఉన్నా... బౌలింగ్ మొదలుపెట్టిన తీరు, మ్యాచ్ ముగించిన విధానం కాస్త ఆందోళన పరిచే అంశం. మన బౌలింగ్ వైఫల్యంతో కివీస్ ఒక దశలో 13 ఓవర్లలో 106/1 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. అశ్విన్ ఒకే ఓవర్లో చాప్మన్, ఫిలిప్స్‌లను పెవిలియన్ చేర్చాకే న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మన చేతుల్లోకి వచ్చారు. అనుభవజ్ఞులైన భువీ, అశ్విన్ తప్ప దీపక్ చహర్, సిరాజ్, అక్షర్ పటేల్‌లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అలాగే సునాయాసంగా ఛేదించాల్సిన లక్ష్యాన్ని ఆఖరి ఓవర్ దాకా తెచ్చుకున్న బ్యాటింగ్ లైనప్‌పై కొత్త కోచ్ ద్రవిడ్ కచ్చితంగా దృష్టిపెట్టాల్సిందే. సూర్యకుమార్ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశమైతే, ఓపెనర్ లోకేశ్ రాహుల్ బ్యాటింగ్‌లో నిలకడ లోపించడం జట్టుకు ఇబ్బందికరం. రోహిత్‌తో కలిసి రాహుల్ చెలరేగితేనే కివీస్‌పై సిరీస్ విజయం సులువవుతుంది. కివీస్ అలసిపోయిందా! న్యూజిలాండ్ ఆదివారం ఫైనల్ ఆడింది. మరో ఆదివారం వచ్చేలోపే నాలుగో మ్యాచ్ ఆడబోతుంది. పైగా వేర్వేరు దేశాల్లో! ఇది ఆటగాళ్లకు ఊపిరి సలపని బిజీ షెడ్యూలే. అయినా సరే ప్రొఫెషనల్ క్రికెటర్లు పోరాటానికి సై అంటున్నారు. వెటరన్ ఓపెనర్ గప్టిల్, టాపార్డర్‌లో చాప్మన్ భారత బౌలింగ్‌ను వణికించారు. వీరికి తోడు మరో ఓపెనర్ డారిల్ మిచెల్, ఫిలిప్స్ ధనాధన్ మెరుపులు మెరిపిస్తే పర్యాటక జట్టు పుంజుకుంటుంది. బ్యాటింగ్‌లో రచిన్ రవీంద్ర, బౌలింగ్‌లో టాడ్ ఆస్టల్ విఫలమవడంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ నీషమ్, స్పిన్నర్ ఇష్ సోధిలను ఆడించే అవకాశాలున్నాయి. జట్టు ప్రధాన బౌలర్లు సౌతీ, బౌల్ట్ ఇద్దరూ తేలిపోవడం జట్టును కలవరపెడుతోంది. సీనియర్ సీమర్లు అంచనాలకు తగ్గట్లు రాణిస్తే జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకం సాధిస్తుంది. భారత్‌ను సొంతగడ్డపై ఓడించాలంటే జట్టు మరింత తీవ్రంగా శ్రమించాల్సిందే! పిచ్, వాతావరణం శీతాకాలం దృష్ట్యా ఇక్కడి పిచ్ ఛేదించేందుకు అనుకూలం. దీంతో టాస్ నెగ్గిన జట్టు ఫీల్డింగే ఎంచుకుంటుంది. మంచు వల్ల బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, సూర్యకుమార్, రిషభ్ పంత్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్ /చహల్, దీపక్ చహర్, అశ్విన్, భువనేశ్వర్, సిరాజ్. న్యూజిలాండ్: సౌతీ (కెప్టెన్), గప్టిల్, డారిల్ మిచెల్, చాప్మన్, ఫిలిప్స్, సీఫెర్ట్, నీషమ్, సాన్‌ట్నర్, బౌల్ట్, ఫెర్గూసన్, ఇష్ సోధి. -
198 సరిపోలేదు
ముంబై: బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించినా... బౌలింగ్ వైఫల్యం కారణంగా ముక్కోణపు టి20 టోర్నీలో భారత మహిళల జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ బృందం 7 వికెట్ల తేడాతో ఓడింది. మొదట భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. టి20ల్లో భారత్‌కిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఓపెనర్లు మిథాలీ రాజ్ (43 బంతుల్లో 53; 7 ఫోర్లు), స్మృతి మంధాన (40 బంతుల్లో 76; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) 12.5 ఓవర్లలో తొలి వికెట్‌కు 129 పరుగులు జతచేశారు. ఈ క్రమంలో స్మృతి 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుంది. భారత్ తరఫున ఇదే వేగవంతమైన అర్ధ సెంచరీ. భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో డానియెలా వ్యాట్ (64 బంతుల్లో 124; 15 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆటే హైలైట్‌గా నిలిచింది. విజయానికి మరో 16 పరుగుల దూరంలో దీప్తి శర్మ (2/36) బౌలింగ్‌లో ఆమె వెనుదిరిగినా... స్కీవర్ (12 నాటౌట్), కెప్టెన్ హెతెర్ (8 నాటౌట్) మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే 199/3తో జట్టును గెలిపించారు. మహిళల అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఇదే అత్యధిక పరుగుల ఛేదన కావడం విశేషం. -
అమెరికా చేతిలో ఓడిన భారత్
మహిళల హాకీ మన్హీమ్ (అమెరికా): భారత మహిళల హాకీ జట్టు తమ అమెరికా పర్యటనను ఓటమితో ఆరంభించింది. రియో ఒలింపిక్స్‌కు చివరి సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో 2-3 తేడాతో భారత్ ఓడింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ప్రీతి దూబే (33వ నిమిషంలో), దీపిక (38) గోల్స్ సాధించారు. అమెరికా నుంచి కథ్లీన్ షార్కే (6), కేటీ బామ్ (31), కెల్సీ కొలోజెచిక్ (48) గోల్స్ చేశారు. రేపు (గురువారం) అమెరికాతో రెండో మ్యాచ్ జరుగుతుంది. -
వరుసగా రెండో ఓటమి
కౌలాలంపూర్: ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఆట తీరు మెరుగుపర్చుకోలేక వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. దీంతో సెమీస్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. గురువారం జరిగిన గ్రూప్-బి రెండో లీగ్ మ్యాచ్‌లో సైనా 9-21, 14-21తో ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. కేవలం 27 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలి గేమ్ ఆరంభంలోనే 1-2తో వెనుకబడింది. ఈ దశలో చైనా క్రీడాకారిణి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 8-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత సైనా వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గినా... ప్రత్యర్థిని మాత్రం అధిగమించలేకపోయింది. ఇక్కడి నుంచి ఇద్దరు ప్లేయర్లు ఒకటి, రెండు పాయింట్లతో గేమ్‌ను కొనసాగించారు. చివరకు జురుయ్ స్కోరు 13-9 ఉన్న దశలో వరుసగా 8 పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో కాస్త పుంజుకున్నట్లు కనిపించిన ఏపీ క్రీడాకారిణి 5-5తో స్కోరును సమం చేసినా ఆ తర్వాత వెనుకబడింది. జురుయ్ రెండుసార్లు వరుసగా 3 పాయింట్లు గెలిస్తే సైనా ఒక్కో పాయింట్‌తో సరిపెట్టుకుంది. స్కోరు 15-11 ఉన్న దశలో జురుయ్ 4 పాయింట్లు సొంతం చేసుకోగా, సైనా మూడు పాయింట్లు గెలిచింది. దీంతో స్కోరు 19-14కు చేరుకుంది. చివరకు రెండు చక్కని పాయింట్లతో జురుయ్ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్ మొత్తంలో ఇద్దరు క్రీడాకారిణిలు స్మాష్‌ల ద్వారా, నెట్ వద్ద ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయారు. శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో సైనా... యోన్ జూ బే (దక్షిణ కొరియా)తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో సైనా కచ్చితంగా గెలవడంతో పాటు... మరో మ్యాచ్‌లో లీ జురుయ్ కూడా గెలవాలని కోరుకోవాలి.