సంపాదనలో ఫెడరర్ టాప్ | In-form Roger Federer seems best bet at US Open | Sakshi
Sakshi News home page

సంపాదనలో ఫెడరర్ టాప్

Published Wed, Aug 27 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

In-form Roger Federer seems best bet at US Open

 ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితా

న్యూయార్క్: ఇటీవలి కాలంలో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవలేకపోయినా స్విస్ థండర్ రోజర్ ఫెడరర్ మాత్రం టెన్నిస్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ఈ జాబితాలో ఫెడరర్ రూ. 337.2 కోట్ల ఆర్జనతో తనకు తిరుగులేదని పించాడు. ఫోర్బ్స్ 2013 జూలై నుంచి 2014 జూన్ వరకు క్రీడాకారుల సంపాదనను పరిగణనలోకి తీసుకున్నారు. రాఫెల్ నాదల్ రూ. 267 కోట్లతో రెం డో స్థానంలో, సెర్బియా స్టార్ జొకోవిచ్ రూ. 198.6 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు.  షరపోవాకు రూ. 146.4 కోట్లతో నాలుగో స్థానం దక్కగా... మహిళల్లో మాత్రం రష్యా భామ షరపోవాదే అగ్రస్థానం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement