ఈసారి ‘సెంచరీ’ లేదు! | IND Vs AUS: Rohit Failed First Odi Against Australia | Sakshi
Sakshi News home page

ఈసారి ‘సెంచరీ’ లేదు!

Published Tue, Jan 14 2020 2:15 PM | Last Updated on Tue, Jan 14 2020 5:36 PM

IND Vs AUS: Rohit Failed First Odi  Against  Australia - Sakshi

ముంబై: ఆస్ట్రేలియాతో ఇక్కడ వాంఖేడే స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ విఫలమయ్యాడు. రోహిత్‌ శర్మ 10 పరుగులకే చేసి తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. స్టార్ట్‌ వేసిన ఐదో ఓవర్‌ మూడో బంతిని మిడాఫ్‌ మీదుగా ఆడటానికి రోహిత్‌ యత్నించాడు. కాగా, అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న డేవిడ్‌ వార్నర్‌ చివరి నిమిషంలో క్యాచ్‌ అందుకోవడంతో రోహిత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. దాంతో 13 పరుగులకే టీమిండియా వికెట్‌ను కోల్పోయింది. కాగా, ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో చివరి మూడు సందర్భాల్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో సెంచరీలు సాధించిన రోహిత్‌..ఈసారి మాత్రం ఫెయిల్‌ అయ్యాడు.

2019లో సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్‌ 133 పరుగులు సాధించగా, అంతకుముందు 2016లో వాకాలో అదే జట్టుతో జరిగిన తొలి వన్డేలో 171 పరుగులు చేశాడు. 2015లో ఎంసీజీలో ఆసీస్‌తో జరిగిన మొదటి వన్డేలో రోహిత్‌ 138 పరుగులు సాధించాడు. కానీ ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్‌ రెండంకెల  స్కోరుకే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. దాంతో భారత బ్యాటింగ్‌ను రోహిత్‌-శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు. కాగా, రోహిత్‌ శర్మ రెండు ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో కనిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. మిచెల్‌ స్టార్క్‌ వేసిన అద్భుతమైన బంతికి కాస్త తడబడ్డ రోహిత్‌ దాన్ని షాట్‌ ఆడబోయి క్యాచ్‌ ఇచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement