అజామ్‌ తర్వాత రాహులే..! | IND Vs NZ: KL Rahul Adds Another Feat To His Cap In T20 Cricket | Sakshi
Sakshi News home page

అజామ్‌ తర్వాత రాహులే..!

Published Fri, Jan 31 2020 3:06 PM | Last Updated on Fri, Jan 31 2020 3:12 PM

IND Vs NZ: KL Rahul Adds Another Feat To His Cap In T20 Cricket - Sakshi

వెల్లింగ్టన్‌:  సూపర్‌ ఫామ్‌లో ఉన్న టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌  పలు ఘనతలు సాధించాడు. ఓవరాల్‌ టీ20 క్రికెట్‌లో నాలుగువేల పరుగుల మార్కును చేరాడు. న్యూజిలాండ్‌తో నాల్గో టీ20కి ముందు ఈ ఫీట్‌ను చేరడానికి 8 పరుగుల దూరంలో ఉన్న రాహుల్‌ దాన్ని సునాయాసంగా అధిగమించాడు. దాంతో టీ20 క్రికెట్‌లో నాలుగు వేల పరుగుల మార్కును చేరిన 94వ క్రికెటర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంచితే, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్‌ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆరో బ్యాట్స్‌మన్‌గా రాహుల్‌ నిలిచాడు. కోహ్లి, రోహిత్‌, ధోని, రైనా, ధావన్‌ల తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రాహుల్‌ గుర్తింపు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో రాహుల్‌ ఇప్పటివరకూ సాధించిన పరుగులు 1,416. (ఇక్కడ చదవండి: మనీష్‌ పాండే నిలబెట్టాడు..!)

ఇక ఓవరాల్‌ టీ20 క్రికెట్‌లో  అత్యుత్తమ సగటు కల్గిన క్రికెటర్ల జాబితాలో రాహుల్‌ రెండో స్థానంలో నిలిచాడు. టీ20 క్రికెట్‌లో రాహుల్‌ యావరేజ్‌ 42.10 కాగా, తొలి స్థానంలో పాకిస్తాన్‌ క్రికెటర్‌ బాబర్‌ అజామ్‌(42.60) ఉన్నాడు. న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రాహుల్‌ కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను రాహుల్‌ అధిగమించాడు. ఈ సిరీస్‌లో రాహుల్‌ ఇప్పటివరకూ వరుసగా 56, 57 నాటౌట్‌, 27, 39 పరుగులు సాధించాడు. ఇక్కడ రాహుల్‌ యావజేర్‌ 83 ఉండగా, స్టైక్‌రేట్‌ 145పైగా ఉంది. (ఇక్కడ చదవండి: శాంసన్‌ ఏందిది..?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement