మౌంట్‌మాంగనీ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో కూడా టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్(2) విఫలమయ్యాడు. మరొకసారి వచ్చిన అవకాశాన్ని శాంసన్ కోల్పోయాడు. ఈ రోజు కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసే క్రమంలో కేఎల్ రాహుల్, శాంసన్‌లు ఓపెనర్లుగా వచ్చారు. అయితే ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కాసేపటికే శాంసన్ పెవిలియన్ చేరాడు. ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొని అనవసరమైన షాట్‌కు నిష్క్రమించాడు.(ఇక్కడ చదవండి: కోహ్లికి విశ్రాంతి.. పంత్‌కు నో చాన్స్)
న్యూజిలాండ్ బౌలర్ కుగ్‌లీన్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి శాంసన్ ఔటయ్యాడు. కవర్స్‌లోకి షాట్ ఆడి సాన్‌ట్నర్‌కు దొరికిపోయాడు. దాంతో 8 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. గత మ్యాచ్‌లో నిరాశపరిచిన శాంసన్‌కు మరొకసారి అవకాశం ఇవ‍్వగా దాన్ని వదిలేసుకున్నాడు. సరిగ్గా ఫీల్డర్ ఉన్న చోటకే షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. ఐదేళ్ల తర్వాత మూడో మ్యాచ్ ఆడుతున్న శాంసన్ సుదీర్ఘకాలం తర్వాత వచ్చిన చాన్స్‌లను వినియోగించుకోవడంలో విఫలమవుతున్నాడు. తాజా మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కోహ్లికి విశ్రాంతి ఇవ్వగా, రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. (ఇక్కడ చదవండి: శాంసన్ ఏందిది..?)
Comments
Please login to add a commentAdd a comment