విశాఖ: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 71 పరుగులు సాధించి సత్తాచాటిన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. ఇక్కడ అదే జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో సైతం మెరుపులు మెరిపించాడు. రోహిత్ శర్మ(159) మూడో వికెట్‌గా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పంత్ పూనకం వచ్చినట్లు రెచ్చిపోయి ఆడాడు. వచ్చీ రావడంతోనే బౌండరీలే లక్ష్యంగా బ్యాట్ ఝుళిపించాడు. గత కొంతకాలంగా తన పవర్ హిట్టింగ్‌పై విమర్శలు చేస్తున్న వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 పరుగులు సాధించి నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు.
పంత్ క్రీజ్‌లో ఉన్నంతసేపు టీమిండియా స్కోరు బోర్డు పరుగులు తీసింది. జోసెఫ్ వేసిన 45 ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టిన పంత్.. కాట్రెల్ వేసిన 46వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లు కొట్టాడు. కీమో పాల్ వేసిన 48 ఓవర్ మూడో బంతికి మరో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. గాల్లోకి లేచిన బంతిని పూరన్ పట్టడంతో పంత్ ఇన్నింగ్స్ ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment