ఆసీస్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ అనధికారిక టెస్టు
చెన్నై: భారత్ ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే సుదీర్ఘకాలం అనంతరం జాతీయ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న స్పిన్నర్ అమిత్ మిశ్రా ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో విశేషంగా రాణించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగా మరో స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (6/132) కూడా ఆకట్టుకున్నాడు. ఇరు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు ఈనెల 28 నుంచి ఇదే వేదికపై జరుగుతుంది. 240 పరుగుల లక్ష్యంతో చివరి రోజు శనివారం బరిలోకి దిగిన ఆసీస్ ‘ఎ’ 46 ఓవర్లలో నాలుగు వికెట్లకు 161 పరుగులు చేసింది.
ఇక ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. బాంక్రాఫ్ట్ (109 బంతుల్లో 51; 8 ఫోర్లు), ట్రేవిస్ హెడ్ (77 బంతుల్లో 50; 6 ఫోర్లు) రాణించగా అమిత్ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు 121/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ‘ఎ’ 78.3 ఓవర్లలో 206/8 వద్ద డి క్లేర్ చేసింది. శ్రేయాస్ అయ్యర్ (66 బంతుల్లో 33; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు.
డ్రానందమే..
Published Sun, Jul 26 2015 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM
Advertisement