టీమిండియానా.. ఆస్ట్రేలియానా..? | india, australia in semi final race | Sakshi
Sakshi News home page

టీమిండియానా.. ఆస్ట్రేలియానా..?

Published Sun, Mar 27 2016 6:46 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

టీమిండియానా.. ఆస్ట్రేలియానా..?

టీమిండియానా.. ఆస్ట్రేలియానా..?

టి-20 ప్రపంచ కప్లో మూడు జట్లకు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూపు దశలో వాటి స్థానాలూ ఖాయమయ్యాయి. ఇక తేలాల్సింది మరో బెర్తు ఎవరిదన్నదే. ఆ బెర్తు టీమిండియాదా లేక ఆస్ట్రేలియాదా..? మరి కొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.

గ్రూపు-2లో ఓటమెరుగని న్యూజిలాండ్ (8) అగ్రస్థానంతో దర్జాగా సెమీస్ చేరింది. మరో బెర్తు కోసం భారత్ (4), ఆస్ట్రేలియా (4) పోటీపడుతున్నాయి. భారత్, ఆసీస్ల మ్యాచ్ విజేతకు సెమీస్ బెర్తు ఖరారవుతుంది. ఈ గ్రూపులో దాయాది పాకిస్తాన్ (2)తో పాటు బోణీ కూడా కొట్టని మరో ఉపఖండం జట్టు బంగ్లాదేశ్ (0) ఇంటిదారి పట్టాయి. ఇక గ్రూపు-1 విషయానికొస్తే వెస్టిండీస్ (6), ఇంగ్లండ్ (6) తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్కు దూసుకెళ్లాయి. ఈ రోజు జరిగిన మ్యాచ్లో విండీస్ పసికూన అఫ్ఘాన్ చేతిలో ఓడినా మెరుగైన రన్రేట్ కారణంగా గ్రూప్ టాపర్గా నిలిచింది. ఈ గ్రూపులో దక్షిణాఫ్రికా (2), శ్రీలంక (2), అఫ్ఘానిస్తాన్ (0) టోర్నీ నుంచి నిష్కమించాయి. ఈ గ్రూపులో మరో లీగ్ మ్యాచ్ జరగాల్సివున్నా నామమాత్రమైనదే.

తొలి సెమీస్లో గ్రూపు-2 టాపర్, గ్రూపు-1లో రెండో స్థానంలో నిలిచిన టీమ్ అంటే కివీస్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. మరో సెమీస్లో గ్రూపు-1 టాప్ టీమ్, గ్రూపు-2లో రెండో స్థానంలో నిలిచిన జట్టు అంటే వెస్డిండీస్, భారత్ లేదా ఆసీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రోజు జరిగే కీలక పోరులో భారత్ గెలిస్తే సెమీస్లో విండీస్ ఎదురుకానుంది. ఈ నెల 30, 31న సెమీస్ మ్యాచ్లు, వచ్చే నెల 3న ఫైనల్ సమరం జరగనున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement