18 ఏళ్ల తర్వాత.. | India beat Netherlands for first time in 18 years | Sakshi
Sakshi News home page

18 ఏళ్ల తర్వాత..

Published Tue, Dec 9 2014 9:52 PM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

18 ఏళ్ల తర్వాత..

18 ఏళ్ల తర్వాత..

భువనేశ్వర్:హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు బోణీ చేసింది. గ్రూప్ బి లో భాగంగా ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్ లో  భారత్ 3-2 తేడాతో నెదర్లాండ్స్ పై విజయం సాధించింది. వరుసగా రెండు పరాజయాలతో డీలా పడిన భారత హాకీ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ప్రపంచ కప్ విజేత, ఒలింపిక్ కాంస్య పతక విజేత నెదర్లాండ్స్ ను మట్టికరిపించింది. పటిష్టమైన నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అత్యద్భుత ఆటతీరును ప్రదర్శించింది. 1996 బార్సిలోనా ఒలింపిక్స్ లో నెదర్లాండ్స్ ను ఓడించిన భారత్ తరువాత ఆ జట్టుపై విజయాన్ని సాధించలేదు. ప్రస్తుత సర్దార్ సింగ్ నేతృత్వంలోని భారత్.. నెదర్లాండ్స్  పై పోరాడి గెలిచి పరువు దక్కించుకుంది.

 

తొలి మ్యాచ్‌లో జర్మనీ చేతిలో, రెండో మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిన టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.  ఇదిలా ఉండగా పటిష్టమైన నెదర్లాండ్స్ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3-0తో అర్జెంటీనాపై, రెండో మ్యాచ్‌లో 4-1తో జర్మనీపై విజయం సాధించింది. అయితే లీగ్ మ్యాచ్‌లతో సంబంధం లేకుండా ఈ టోర్నీ బరిలో ఉన్న ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.గ్రూప్ ‘ఎ’లో టాప్‌గా నిలిచే అవకాశమున్న ఇంగ్లండ్‌తో సర్దార్ సింగ్ బృందం ఆడే అవకాశం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement