
'ఆ సత్తా విరాట్ సేనకు ఉంది'
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియా తిరిగి టైటిల్ ను నిలబెట్టుకుంటుందని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర జోస్యం చెప్పాడు.
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియాకు తిరిగి టైటిల్ ను నిలబెట్టుకునే సత్తా ఉంందని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర జోస్యం చెప్పాడు. అన్ని విభాగాల్లో భారత జట్టు బలంగా ఉండటమే ఆ జట్టను మరొకసారి చాంపియన్గా నిలపడానికి ఆస్కారం ఉందన్నాడు.
'చాంపియన్స్ ట్రోఫీకి అడుగుపెట్టిన భారత జట్టు సమతుల్యంగా ఉంది. ప్రధానంగా ఆ జట్టు పేస్ బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది. దాంతో పాటు అశ్విన్, జడేజా వంటి టాప్ స్పిన్నర్లు కూడా ఆ జట్టులో ఉన్నారు. భారత జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు. చాంపియన్స్ ట్రోఫీని విరాట్ సేన కైవసం చేసుకోవడం ఖాయం. ఐపీఎల్లో ఘోరంగా విఫలమైన విరాట్ కోహ్లి ఇక్కడ కచ్చితంగా సత్తాచాటతాడు'అని ఐసీసీ వెబ్సైట్ కు రాసిన కాలమ్లో సంగక్కర పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, దక్షిణాఫ్రికాలే సెమీ ఫైనల్ కు చేరే తన ఫేవరెట్ జట్లుగా సంగక్కర పేర్కొన్నాడు. అయితే ఫైనల్ కు చేరే జట్లను కచ్చితంగా అంచనా వేయడం కష్టంగా ఉందన్నాడు.