
వారిద్దరి బంధం బాగా కలిసొస్తుంది
ధోని, కోహ్లి మధ్య ఉన్న సాన్నిహిత్యం కోహ్లి కెప్టెన్‌గా ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడుతుందని భారత క్రికెట్ జట్టు అనిల్ కుంబ్లే అభిప్రాయ పడ్డారు. యువీ మినహా మిగతావారంతా ధోని నాయకత్వంలోనే ఆటలోకి అడుగు పెట్టారని, ఈ సమయంలో ధోని, కోహ్లి కలిసి పని చేయడం జట్టుకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. ధోనిని తాము ఇప్పటికీ ‘లీడర్’గానే భావిస్తున్నట్లు కుంబ్లే వ్యాఖ్యానించారు. తనకంటే ఎంతో సీనియర్లు ఉన్న జట్టును నడిపించిన తీరు ధోని కెప్టెన్సీ గొప్పతనాన్ని చూపిస్తోందన్న కుంబ్లే... నాయకత్వంనుంచి తప్పుకునే విషయంలో ధోని కూడా తనలాగే ఆలోచించాడన్నారు.