లంకతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా | India draws against srilanka practice match | Sakshi
Sakshi News home page

లంకతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా

Published Sat, Aug 8 2015 5:34 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

లంకతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా - Sakshi

లంకతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా

కొలంబో: శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ లెవన్తో భారత్ మూడ్రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ తొలి రెండు రోజులూ బ్యాటింగ్, బౌలింగ్లో సత్తాచాటిన టీమిండియా.. మూడో రోజు జోరు తగ్గింది.

శనివారం 411 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక ఆట ముగిసేసరికి 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఓ దశలో లంక 154/6 స్కోరుతో ఓటమి అంచున నిలిచింది. అయితే ఆ తర్వాత భారత బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు. కౌశల్ సిల్వా (83 నాటౌట్), తరంగ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు 112/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 180 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ల్లో భారత్ 351, లంక 121 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement