కొలంబో: శ్రీలంకతో రెండో టెస్టులో భారత్ 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. మ్యాచ్ మూడో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు 306 పరుగులకు ఆలౌటయ్యారు. ఈ రోజు మాథ్యూస్ (102) సెంచరీ, తిరుమన్నె (62) హాఫ్ సెంచరీలతో రాణించడం మినహా ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. భారత బౌలర్లు అమిత్ మిశ్రా 4, ఇషాంత్, అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 393 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
140/3 ఓవర్నైట్ స్కోరుతో ఈ రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు టీ విరామానికి 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేశారు. లంక ఓవర్నైట్ బ్యాట్స్మెన్ మాథ్యూస్, తిరుమన్నె నాలుగో వికెట్కు 127 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి సెషన్లో విఫలమైన భారత బౌలర్లు లంచ్ విరామం తర్వాత విజృంభించారు. వెంటవెంటనే నాలుగు వికెట్లు పడగొట్టి లంకను కట్టడి చేశారు. భారత పేసర్ ఇషాంత్.. తిరుమన్నెను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. కాసేపటి తర్వాత ఇషాంత్.. చండీమల్ (11)ను పెవిలియన్ చేర్చాడు. సెంచరీ హీరో మాథ్యూస్తో పాటు దమ్మిక ప్రసాద్ (5) వెంటవెంటనే అవుటయ్యారు. టీ విరామం తర్వాత లంక మిగిలిన మూడు వికెట్లూ కోల్పోయింది.
టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
Published Sat, Aug 22 2015 4:00 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement