బాకు (అజర్‌బైజాన్) : ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. భారత్ నుంచి బరిలో మిగిలిన గ్రాండ్‌మాస్టర్ సేతురామన్ మూడో రౌండ్‌లో నిష్ర్కమించాడు. షఖిరి యార్ మమెద్యరోవ్ (అజర్‌బైజాన్)తో జరిగిన మూడో రౌండ్‌లో సేతురామన్ 0.5-1.5 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. గురువారం జరిగిన తొలి గేమ్‌లో సేతురామన్ 41 ఎత్తుల్లో ఓడిపోగా... శుక్రవారం జరిగిన రెండో గేమ్‌ను సేతురామన్ 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.
ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు సూర్యశేఖర గంగూలీ, లలిత్, ఆదిబన్, విదిత్ తొలి రౌండ్‌లోనే ఓటమి చెందగా... హరికృష్ణ రెండో రౌండ్‌లో నిష్ర్కమించాడు.
ముగిసిన భారత్ పోరు
Published Sat, Sep 19 2015 2:52 AM | Last Updated on Wed, Aug 29 2018 1:13 PM
Advertisement
Advertisement