Sethuraman
-
గుండెపోటుతో యువ నటుడు మృతి
చెన్నై : తమిళ యువ నటుడు సేతురామన్ (36) కన్నుమూశారు. గురువారం గుండెపోటు రావడంతో రాత్రి 8 గంటల 45 నిమిషాలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సేతురామన్ ఆకస్మిక మరణం తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురైంది. కాగా సేతురామన్ నటుడే కాక వృత్తిరిత్యా చర్మ వ్యాధి నిపుణుడు కూడా. చెన్నైలో స్వతహాగా జీ క్లినిక్‌ను (స్కిన్ కేర్) ఏర్పాటు చేసుకొని వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. సేతురామన్‌కు భార్య ఉమయాల్, ఏడాది వయస్సున్న కూతురు ఉన్నారు. సేతురామన్ తమిళ హాస్య నటుడు సంతానానికి అత్యంత సన్నిహితుడు. 2013 లో విడుదలైన కన్నా లడ్డూ తిన్నా ఆసయ్య చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. డైరెక్టర్ మణికందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతానం, సేతు, పవర్‌స్టార్ శ్రీనివాసన్, విశాఖా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనంతరం వాలిబా రాజా, సక్కా పోడు పోడు రాజా అండ్ 50/50.. వంటి చిత్రాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా సేతురామన్ మరణం పట్ల అనేక మంది నటులు, దర్శకులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఖుష్బు, నిర్మాత వెంకట్ ప్రభు, ధనంజయన్ తదితరులు సేతురామన్ ఆత్మకి శాంతి చేకూరాలని ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. ఇక సేతురామన్ అంత్యక్రియలు ఈ రోజు(శుక్రవారం) జరగనున్నాయి. -
ఆసియా చాంప్స్
భక్తి, సేతురామన్ తాష్కెంట్: ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో మహిళల, ఓపెన్ విభాగంలో భారత్‌కు చెందిన భక్తి కులకర్ణి, సేతురామన్ విజేతలుగా నిలిచారు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఆయా విభాగాల్లో భక్తి, సేతురామన్ ఏడేసి పాయింట్లతో అగ్రస్థానాలను దక్కించుకున్నారు. గోవాకు చెందిన భక్తి తాజా విజయంతో వచ్చే ఏడాది జరిగే ప్రపంచ మహిళల నాకౌట్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో భక్తి ఐదు గేముల్లో నెగ్గి, మిగతా నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. సేతురామన్ ఆరు గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన సౌమ్య స్వామినాథన్ 6.5 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష ఐదు పాయింట్లతో పదో స్థానాన్ని దక్కించుకుంది. -
ముగిసిన భారత్ పోరు
బాకు (అజర్బైజాన్) : ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. భారత్ నుంచి బరిలో మిగిలిన గ్రాండ్‌మాస్టర్ సేతురామన్ మూడో రౌండ్లో నిష్ర్కమించాడు. షఖిరి యార్ మమెద్యరోవ్ (అజర్బైజాన్)తో జరిగిన మూడో రౌండ్లో సేతురామన్ 0.5-1.5 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. గురువారం జరిగిన తొలి గేమ్‌లో సేతురామన్ 41 ఎత్తుల్లో ఓడిపోగా... శుక్రవారం జరిగిన రెండో గేమ్‌ను సేతురామన్ 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు సూర్యశేఖర గంగూలీ, లలిత్, ఆదిబన్, విదిత్ తొలి రౌండ్లోనే ఓటమి చెందగా... హరికృష్ణ రెండో రౌండ్లో నిష్ర్కమించాడు. -
ప్రపంచ కప్‌లో హరికృష్ణకు చుక్కెదురు
బాకు (అజర్బైజాన్) : ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ నుంచి భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ నిష్ర్కమించాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ సేతురామన్‌తో జరిగిన రెండో రౌండ్లో ఈ హైదరాబాద్ చెస్ ప్లేయర్ 0.5-1.5 తేడాతో ఓడిపోయాడు. సోమవారం జరిగిన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ... మంగళవారం జరిగిన రెండో గేమ్‌లో 46 ఎత్తుల్లో ఓడిపోయాడు. హరికృష్ణ ఓటమితో ఈ మెగా ఈవెంట్లో భారత్ నుంచి సేతురామన్ ఒక్కడే బరిలో మిగిలాడు. ఈ టోర్నీలో ఇతర భారత ఆటగాళ్లు సూర్యశేఖర గంగూలీ, లలిత్ బాబు, విదిత్ గుజరాతీ, ఆధిబన్ తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యారు. -
ఒబామా కొలువులో మరో భారతీయ శాస్త్రవేత్త
జాతీయ సైన్స్ బోర్డు సభ్యుడిగా సేతురామన్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొలువులో మరో భారతీయుడికి గౌరవం దక్కింది. భారత-అమెరికన్ శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్ అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్‌లో కీలక స్థానానికి ఎంపికయ్యారు. ఆయన్ను ప్రఖ్యాత జాతీయ సైన్స్ బోర్డు సభ్యుడిగా నియమించారు. సేతురామన్ మద్రాస్ యూనివర్సిటీ వివేకానంద కాలేజీ నుంచి 1981లో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. ఐఐటీలో ఎంటెక్ చేసి చెన్నైలోని ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో డేటా కమ్యూనికేషన్ ఇంజనీర్‌గా పనిచేశారు. -
జిఎం చెస్ విజేత సేతు రామన్
-
‘కింగ్’ సేతురామన్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ (జీఎం) చెస్ టోర్నమెంట్-2013ను భారత గ్రాండ్‌మాస్టర్ ఎస్పీ సేతురామన్ గెలుచుకున్నాడు. మంగళవారం ఇక్కడి కోట్ల విజయ భాస్కర రెడ్డి స్టేడియంలో ముగిసిన ఈ టోర్నీలో సేతురామన్ 11 రౌండ్ల ద్వారా మొత్తం 8.5 పాయింట్లతో టాప్‌గా నిలిచాడు. మెరాబ్ (జార్జియా)తో జరిగిన ఆఖరి రౌండ్ మ్యాచ్‌ను డ్రా చేసుకొని అతను అగ్రస్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. రష్యా గ్రాండ్ మాస్టర్ ఇవాన్ పొపొవ్ (8.5) కూడా పాయింట్లపరంగా సమంగా నిలిచినా... ‘బుకాల్జ్ టైబ్రేక్’ పద్ధతి ద్వారా సేతుకు టైటిల్ దక్కింది. ఇవాన్ తన ఆఖరి గేమ్‌లో లెవాన్ (జార్జియా)ను ఓడించాడు. విజేతకు రూ. 2 లక్షలు, రన్నరప్‌కు రూ. లక్షా 50 వేలు ప్రైజ్‌మనీగా లభించాయి. మరో భారత ఆటగాడు విదిత్ గుజరాతీ (8 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచాడు. విదిత్ 11వ రౌండ్లో టోర్నికే (జార్జియా)ను ఓడించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లలిత్‌బాబు (24వ స్థానం), ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ (27), రవితేజ (28) టాప్-30లో నిలిచారు. ఈ టోర్నీ ద్వారా బాలచంద్ర, రవితేజలు ఐఎం నార్మ్‌లు అందుకున్నారు. ఆకట్టుకున్న ఏపీ ఆటగాళ్లు... 2100కంటే తక్కువ రేటింగ్ ఉన్న ఆటగాళ్ల కోసం నిర్వహించిన ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నీ (కేటగిరి బి)లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు వి. వరుణ్ (8.5 పాయింట్లు) విజేతగా నిలిచాడు. ఆఖరి రౌండ్లో వరుణ్ మన రాష్ట్రానికే చెందిన రమణబాబును ఓడించి టైటిల్ ఖాయం చేసుకున్నాడు. అతనికి రూ. 1 లక్ష రూపాయల నగదు బహుమతి దక్కింది.