భక్తి, సేతురామన్
తాష్కెంట్: ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో మహిళల, ఓపెన్ విభాగంలో భారత్‌కు చెందిన భక్తి కులకర్ణి, సేతురామన్ విజేతలుగా నిలిచారు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఆయా విభాగాల్లో భక్తి, సేతురామన్ ఏడేసి పాయింట్లతో అగ్రస్థానాలను దక్కించుకున్నారు. గోవాకు చెందిన భక్తి తాజా విజయంతో వచ్చే ఏడాది జరిగే ప్రపంచ మహిళల నాకౌట్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో భక్తి ఐదు గేముల్లో నెగ్గి, మిగతా నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది.
సేతురామన్ ఆరు గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన సౌమ్య స్వామినాథన్ 6.5 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష ఐదు పాయింట్లతో పదో స్థానాన్ని దక్కించుకుంది.
ఆసియా చాంప్స్
Published Sat, Jun 4 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM
Advertisement
Advertisement