ప్రపంచ కప్‌లో హరికృష్ణకు చుక్కెదురు | Shock to harikrishna in world cup | Sakshi
Sakshi News home page

ప్రపంచ కప్‌లో హరికృష్ణకు చుక్కెదురు

Published Wed, Sep 16 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

ప్రపంచ కప్‌లో హరికృష్ణకు చుక్కెదురు

ప్రపంచ కప్‌లో హరికృష్ణకు చుక్కెదురు

బాకు (అజర్‌బైజాన్) : ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ నుంచి భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ నిష్ర్కమించాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ సేతురామన్‌తో జరిగిన రెండో రౌండ్‌లో ఈ హైదరాబాద్ చెస్ ప్లేయర్ 0.5-1.5 తేడాతో ఓడిపోయాడు. సోమవారం జరిగిన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ... మంగళవారం జరిగిన రెండో గేమ్‌లో 46 ఎత్తుల్లో ఓడిపోయాడు. హరికృష్ణ ఓటమితో ఈ మెగా ఈవెంట్‌లో భారత్ నుంచి సేతురామన్ ఒక్కడే బరిలో మిగిలాడు. ఈ టోర్నీలో ఇతర భారత ఆటగాళ్లు సూర్యశేఖర గంగూలీ, లలిత్ బాబు, విదిత్ గుజరాతీ, ఆధిబన్ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement