బకూ (అజర్‌బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో చాంపియన్ ఎవరో టైబ్రేక్స్ ద్వారా తేలనుంది. భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద, వరల్డ్ నంబర్‌వన్ కార్ల్‌సన్ (నార్వే) మధ్య ఫైనల్లో రెండో గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. వరుసగా రెండో ‘డ్రా’ తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. ఫలితంగా నేడు వీరిద్దరి మధ్య టైబ్రేక్ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు.
ముందుగా ర్యాపిడ్ ఫార్మాట్‌లో 25 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లు ఆడిస్తారు. ఇందులో ఫలితం వస్తే ఫైనల్‌ను ముగిస్తారు. రెండు గేమ్‌ల తర్వాత కూడా సమంగా ఉంటే... ఈసారి 10 నిమిషాలు నిడివిగల రెండు గేమ్‌లు నిర్వహిస్తారు. ఇక్కడా ఫలితం తేలకపోతే 5 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లను ఆడిస్తారు.
అయినా ఫలితం తేలకపోతే 3 నిమిషాల నిడివిగల గేమ్‌లను ఇద్దరిలో ఒకరు గెలిచే వరకు ఆడించి విజేతను ఖరారు చేస్తారు. 32 ఏళ్ల కార్ల్‌సన్ గతంలో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్‌లలో ప్రపంచ చాంపియన్‌గా నిలువగా... ప్రజ్ఞానంద కెరీర్‌లో తొలిసారి ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment