భారత్ హ్యాట్రిక్ | india hatrick in federation cup | Sakshi
Sakshi News home page

భారత్ హ్యాట్రిక్

Published Fri, Feb 7 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

india hatrick in federation cup

అస్తానా (కజకిస్తాన్) : ఫెడరేషన్ కప్‌లో ఇండియా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఆసియా ఓసియానియా గ్రూప్ 2 పూల్-డి చివరి లీగ్‌లో భారత్ 2-1తో న్యూజిలాండ్‌పై నెగ్గింది.
 
  తొలి సింగిల్స్‌లో ప్రార్థన 6-1, 6-4తో డానీ హాలెండ్‌పై గెలిచి శుభారంభాన్ని అందించింది. రెండో సింగిల్స్‌లో అంకితా రైనా 1-6, 2-6తో ఎరకోవిచ్ చేతిలో ఓటమిపాలైంది. కీలకమైన డబుల్స్ మ్యాచ్‌లో ప్రార్థనతో కలిసి సానియా సత్తా చాటింది. 7-5, 6-1తో భారత్‌కు విజయాన్ని అందించింది.  గ్రూప్ ఏ విజేత హాంకాంగ్‌తో భారత్ తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement